ICMR-AIIMS: కేంద్రం కీలక ప్రకటన.. ఆకస్మిక మరణాలతో కోవిడ్ వ్యాక్సిన్లకు సంబంధం లేదు

Covid Vaccines Cleared Of Sudden Death, Heart Attack Link, Says Health Ministry: కోవిడ్ వ్యాక్సిన్లపై కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. కోవిడ్ తర్వాత ఆకస్మిక మరణాలపై ఐసీఎంఆర్, ఎయిమ్స్ అధ్యయనం చేయగా.. సంచలన ప్రకటన చేసింది. ఆకస్మిక మరణాలతో కోవిడ్ వ్యాక్సిన్లకు సంబంధం లేదని తెలిపింది. యువత ఆకస్మిక మరణాలకు మయోకార్డియల్ ఇన్ఫార్షన్ కారణమని నిర్ధారించింది.
గత కొంతకాలంగా మరణిస్తున్న వారిలో మయోకార్డియల్ ఇన్ఫార్షన్ ప్రధాన కారణంగా అధ్యయనంలో ప్రాథమికంగా గుర్తించారు. అంతర్లీన ఆరోగ్య సమస్యలు, ప్రమాదకర జీవనశైలి, జన్యు పరమైన సమస్యల వల్లే ఎక్కువగా ఆకస్మిక మరణాలు చోటుచేసుకున్నట్లు నిర్ధారించాయి. మరణాలకు వ్యాక్సిన్లే కారణమనే ప్రచారం తప్పు అని కేంద్రం స్పష్టం చేసింది.