Published On:

Union Cabinet Meeting: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం

Union Cabinet Meeting: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం

Union Cabinet Meeting Organize Today: ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుందని సమాచారం. ముఖ్యంగా దేశ భద్రతా, వాణిజ్యం, వ్యవసాయ రంగాలపై కేబినెట్ మాట్లాడుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా భారత్ పై ఎలాంటి ప్రభావం ఉంటుందో, పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉంటాయోనని సమీక్ష చేయనుంది. ఇటీవల అహ్మదాబాద్ విమాన ప్రమాదం, త్వరలో జరగబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై కూడా మంత్రివర్గంలో చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

అలాగే త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరగనుందని సమాచారం. ముఖ్యంగా ప్రతిపక్షాలు లెవనెత్తే అంశాలు, ప్రభుత్వం తరపున చెప్పాల్సిన సమాధానాలు, అందుకు తగిన ఆధారాలు చూపడం వంటివి మాట్లాడకోనున్నారని తెలుస్తోంది. ఇక పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ కు సంబంధించి పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక చర్చ నిర్వహించాలని ఇప్పటికే ప్రతిపక్షాలు కోరాయి. కానీ వాటిని కేంద్రం తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు సమర్థవంతంగా తిప్పికొట్టేలా మంత్రులకు కీలక సూచనలు చేసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి: