Published On:

PM Modi: ఐదు దేశాల పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ

PM Modi: ఐదు దేశాల పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ

PM Foregin Tour: ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు బయల్దేరారు. ఐదు దేశాల పర్యటన, బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొననున్నారు. సమావేశంలో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్తున్న ప్రధాని.. గ్లోబల్ సౌత్ లోని పలు కీలక దేశాలతో భారత్ సంబంధాలను విస్తరించడమే లక్ష్యంగా తన పర్యటన కొనసాగించనున్నారు. ఈనెల 9 వరకు ప్రధాని పర్యటన కొనసాగనుంది.

రేపు, ఎల్లుండి ఆఫ్రికాలోని ఘనా దేశంలో ప్రధాని పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడితో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఆర్థిక, ఇంధన, రక్షణ సహకారంపై భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ఉన్న అవకాశాలపై చర్చించనున్నారు. చర్చల తర్వాత ఆ దేశ పార్లమెంట్ ను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. అనంతరం జులై 3, 4 తేదీల్లో ట్రినిడాన్ అండ్ టొబాగో దేశంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు క్రిస్టీన్ కార్లా కంగలూ, ప్రధాన మంత్రి కమలా పెర్సాద్- బిస్సేసర్ తో మోదీ చర్చలు జరపనున్నారు. ఇండియా- ట్రినిడాడ్ సంబంధాలను బలోపేతం చేయడంపై మోదీ చర్చలు జరపనున్నారు. అనంతరం ఆ దేశ పార్లమెంట్ లో మోదీ ప్రసంగం చేయనున్నారు.

ఇక జులై 4, 5 తేదీల్లో ప్రధాని మోదీ అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే ఆహ్వానం మేరకు పర్యటించనున్నారు. పలు కీలక రంగాల్లో ఇరుదేశాల మధ్య భాగస్వామ్యాన్ని పెంపొందించే అంశాలపై చర్చించనున్నారు. తర్వాత జులై 5 నుంచి 8 వరకు బ్రెజిల్ లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా ఆహ్వానం మేరకు మోదీ బ్రెజిల్ కు వెళ్లి రియోలో జరిగే 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి పాల్గొననున్నారు. చివరిగా జులై 9న నమీబియా దేశంలో పర్యటిస్తారు. ఆ దేశ అధ్యక్షుడు నేతుంబో నంది- న్దైత్వా ఆహ్వానం మేరకు ఆ దేశానికి ప్రధాని మోదీ వెళ్లనున్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలపై చర్చించనున్నారు. అలాగే నమీబియా పార్లమెంట్ లో ప్రసంగించనున్నారు.

 

ఇవి కూడా చదవండి: