PM Modi: ప్రగతి ఎజెండా మీటింగ్.. 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీపీ

Prime Minister Modi with Chief Ministers of 4 states Pragati Agenda Meeting: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ 4 రాష్ట్రాల సీఎంలతో ప్రగతి ఎజెండా సమావేశం కానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రగతి ఎజెండా సమావేశం నిర్వహించనున్నారు. ఈ ప్రగతి ఎజెండా సమావేశం భాగంగా ఆయా రాష్ట్రాల్లోని కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ చర్చించనున్నారు.
ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు, ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాలు, కీలకమైన డెవలప్ మెంట్ ప్రాజెక్టులు, రోడ్డు, రైల్వే, పవర్, గనులు, సంక్షేమం తదతిర అంశాలపై ప్రధాని మోదీ 4 రాష్ట్రాల సీఎంలో చర్చించే ఛాన్స్ ఉంది. కాగా, ఇటీవల పోలవరం ప్రాజెక్టు విషయంలో జరిగిన సమావేశంలో ఆందోళనలు నెలకొన్నాయి. వరదల విషయంలో జరిగిన సమస్యలపై మరోసారి ఈ భేటి జరుగుతుండడంతో ఆసక్తికరంగా మారింది.