PM Modi Tour: విదేశీ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ.. 8రోజుల పాటు 5 దేశాలు!

PM Modi Five Nations Tour: ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు బయలుదేరారు. ఈ మేరకు ఆయన ఎనిమిది రోజుల పాటు ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాల్లో పర్యటింస్తారని కేంద్ర విదేశాంగ శాఖ పేర్కొంది. అయితే భారత ప్రధాని మూడు దశాబ్ధాల తర్వాత ఘనాలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడితో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది.
నేటి నుంచి 8 రోజుల పాటు 5 దేశాల్లో మోదీ టూర్ ఉండనుంది. ఇందులో భాగంగా నేడు, రేపు ఘనా, ట్రినిడాడ్ దేశాల్లో మోదీ పర్యటించనున్నారు. 30 ఏళ్లలో ఘనాకు వెళ్తున్న తొలి భారత ప్రధాని మోదీ రికార్డుకెక్కనున్నారు.