Published On:

Union Cabinet Meeting: ముగిసిన కేంద్ర కేబినెట్ మీటింగ్

Union Cabinet Meeting: ముగిసిన కేంద్ర కేబినెట్ మీటింగ్

Crucial Desicions Takes In Cabinet Meeting: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముందుగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కేబినెట్ లో తీర్మానం చేశారు. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రులు 2 నిమిషాలు మౌనం పాటించారు. ఎమర్జెన్సీ టైంలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేసిందని ప్రధాని మోదీ అన్నారు. ఎమర్జెన్సీ గురించి ప్రస్తుత తరానికి అవగాహన కల్పించాలని సూచించారు.

 

అనంతరం పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పుణె మెట్రోరైలు విస్తరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అందులో భాగంగా పుణె మెట్రో రైలు ఫేజ్-2 పనులకు రూ. 3,626 కోట్లు మంజూరు చేసింది. అలాగే ఆగ్రాలో ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ రీజినల్ కేంద్రానికి ఆమోదం చెప్పింది. అందుకు గాను రూ. 111.5 కోట్లను కేటాయించింది. జార్ఖండ్ లోని జారియ కోల్ ఫీల్డ్ లో పునరావాసానికి గాను రూ. 5940 కోట్లను కేటాయించింది.

 

అలాగే బీహార్ లో తొలి అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవుల్లోనూ అణు విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కేంద్రం భావించింది. అందుకు సంబంధించి 2025- 26 బడ్జెట్ లో ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో దేశంలో తొలి అణు విద్యుత్ ప్లాంట్ ను బీహార్ లో ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈమేరకు విద్యుత్ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. కాగా ఈ ఏడాది చివర్లో బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీహార్ లో అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి: