Published On:

PM Modi: శుభాంశు శుక్లాతో ముచ్చటించిన ప్రధాని మోదీ

PM Modi: శుభాంశు శుక్లాతో ముచ్చటించిన ప్రధాని మోదీ

PM Modi interacts with Shubhanshu Shukla: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా ఖ్యాతి పొందిన శుభాంశు శుక్లాతో ప్రధాని మోదీ మాట్లాడారు. శనివారం ఐఎస్‌ఎస్‌లో ఉన్న శుక్లాతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని మాట్లాడారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం ఎక్స్‌‌లో పోస్ట్‌ చేసింది.

 

శుక్లాకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారని పేర్కొంది. అక్కడ మిషన్‌ విజయవంతం కావాలని కోరిందతి. భవిష్యత్‌లో శుక్లా మరిన్ని విజయాలు సాధించాలని ప్రధాని ఆకాంక్షిచినట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు శుభాంశుతో మోదీ మాట్లాడుతున్న ఫొటోను పీఎం కార్యాలయం షేర్‌ చేసింది.

 

యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఫాల్కన్‌-9 రాకెట్‌ ద్వారా ఇండియాకు చెందిన శుక్లా సహా పెగ్గీ విట్సన్‌ (అమెరికా), స్లావోస్జ్‌ ఉజ్నాన్స్‌కీ -విస్నీవ్‌స్కీ (పోలండ్‌), టిబర్‌ కపు (హంగరీ)లు అంతరిక్షంలోకి వెళ్లారు. భారత కాలమానం ప్రకారం ఈ నెల 25న బుధవారం మధ్యాహ్నం 12.01 గంటలకు అమెరికాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమనౌక బయలుదేరింది. గురువారం సాయంత్రం ‘ఐఎస్‌ఎస్‌’కు చేరుకుంది. డాకింగ్‌ అనంతరం వీరంతా అందులోకి ప్రవేశించారు. మిషన్‌లో భాగంగా 14 రోజులపాటు అక్కడే గడపనున్నారు.

 

ఇవి కూడా చదవండి: