Congress: హైదరాబాద్ కు చేరుకున్న మల్లికార్జున్ ఖర్గే

Mallikarjun kharge: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ఖర్గేకు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు, ఇతర నాయకులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి మల్లికార్జున ఖర్గే తాజ్ కృష్ణ హోటల్ కి చేరుకున్నారు. రేపు పీఏసీ మీటింగ్‌లో ఖర్గే పాల్గొననున్నారు. రేపు సాయంత్రం గ్రామశాఖ అధ్యక్షుల సభలో ఖర్గే ప్రసంగించనున్నారు.
మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ నేతలతో మల్లికార్జున్ ఖర్గే వన్ టు వన్ మీట్ అయ్యారు. తాజ్ కృష్ణ హోటల్ లో ఖర్గేతో మల్రెడ్డి రంగా రెడ్డి , బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వేరు వేరుగా మాట్లాడారు. జిల్లాకో మంత్రిని ఇవ్వాలని డిమాండ్ చేశానని… ఇచ్చిన జిల్లాకే మంత్రులు ఇస్తే బాగోదని ఖర్గేకు సూచించినట్లు మల్ రెడ్డి రంగారెడ్డి చెప్పారు.
మల్లిఖార్జున్ ఖర్గేని కలిసి.. మంత్రి పదవి గురించి అడిగానని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. పార్టీలో సీనియర్లము ఉన్నామని.. తమకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు. పార్టీకోసం కష్టపడి పనిచేశామని.. మంత్రి పదవి ఆశిస్తున్నామని ఖర్గేతో చెప్పినట్లు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెప్పారు. మంత్రి పదవి కాకుండా మరే ప్రత్యామ్నాయం వద్దన్నట్లు తెలిపారు.