Published On:

PM Modi: ఘనాలో ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

PM Modi: ఘనాలో ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

PM Tour In Ghana: ప్రధాని మోదీ ఘనాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అరుదైన గౌరవం దక్కింది. ఘనా దేశ అత్యున్నత పురస్కారం అందుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఘనాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’తో సత్కరించారు. నిన్న ఘనా రాజధాని అక్రలో జరిగిన కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు జాన్ ద్రమాని మహామా ఈ అవార్డును అందజేశారు.

 

‘ఘనా జాతీయ గౌరవం దక్కడం నాకు చాలా గర్వకారణం, గౌరవం. ఇది భారత్- ఘనా మధ్య ఉన్న బలమైన, చిరకాల సంబంధాలకు నిదర్శనం. అధ్యక్షుడు మహామా, ఘనా ప్రభుత్వం, ఘనా ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 140 కోట్ల మంది భారతీయుల తరపున నేను ఈ గౌరవాన్ని వినయంగా స్వీకరిస్తున్నాను. ఇది మన యువత ఆకాంక్షలు, వారి ఉజ్వల భవిష్యత్తుకు, మన గొప్ప సాంస్కృతిక వైవిధ్యం, సంప్రదాయాలకు, భారతదేశం, ఘనా మధ్య చారిత్రక సంబంధాలకు అంకితం చేస్తున్నాను’ అని ప్రధాని మోదీ అన్నారు.

కాగా రెండురోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ నిన్న రాత్రి ఘనా చేరుకున్నారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఘనాకు వెళ్లడం ఇదే తొలిసారి. అక్రలోని కోటోకా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో మోదీకి ఘన స్వాగతం లభించింది. ఘనా గడ్డపై తనకు లభించిన ఆత్మీయ స్వాగతం పట్ల ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. అధ్యక్షుడు స్వయంగా విమానాశ్రయానికి రావడం తనకు దక్కిన గొప్ప గౌరవమని అన్నారు. సంయుక్త ప్రకటన విడుదల చేస్తూ, భారత్- ఘనా స్నేహానికి ప్రధాన అంశం మన ఉమ్మడి విలువలు, పోరాటం, సమ్మిళిత భవిష్యత్తు కోసం ఉమ్మడి కలలు అని, ఇది ఇతర దేశాలకు కూడా స్ఫూర్తినిచ్చిందని ప్రదాని వెల్లడించారు.

 

ఇవి కూడా చదవండి: