Published On:

HYDRA: బాలానగర్‌లో పర్యటించిన హైడ్రా.!

HYDRA: బాలానగర్‌లో పర్యటించిన హైడ్రా.!

HYDRA: హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారుల బృందంతో కలిసి హైదరాబాద్‌లోని బాలానగర్‌లో పర్యటించారు. వినాయకనగర్ కాలనీలోని గడ్డి చేను స్థలాన్ని అనుకుని ఉన్న నాలాను పరిశీలించి, ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు. అనంతరం కళ్యాణ్ నగర్ వద్ద ఉన్న నాలాలను అధికారులతో కలిసి పరిశీలించారు. నాలా ఉన్న ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో ఆక్రమణలను తక్షణమే తొలగిస్తామని రంగనాథ్‌ చెప్పారు.

నాలాకు వెళ్లే దారిలో ఓ వ్యక్తి గేటుకు తాళం వేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు రంగనాథ్. తక్షణమే తాలంను పగలగొట్టాలని ఆదేశించారు.  నాలా లోపల ఉన్ సిల్ట్‌ను సైతం తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. డ్రోన్ కెమెరాతో నాలా మొత్తం పొడవునా వీడియో ద్వారా పరిశీలిస్తామని.. నాలా ఆక్రమణలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేనిది స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి: