India – Pakistan: భారత బీఎస్ఎఫ్ జవాన్ రిలీజ్.. 20 రోజుల తర్వాత అప్పగించిన పాక్

Pakistan Rangers Released BSF Jawan Purnam Kumar Sau: భారత బీఎస్ఎఫ్ జవాన్‌ను పాకిస్థాన్ విడుదల చేసింది. దాదాపు 20 రోజుల తర్వాత పాక్ ఆయనను భారత్‌కు అప్పగించింది. ఈ మేరకు ఏప్రిల్ 23 నుంచి పాకిస్తాన్ రేంజర్స్ అదుపులో ఉన్న బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ పూర్ణమ్ కుమార్ షాను అమృత్‌సర్‌లోని అట్టారిలోని జాయింట్ చెక్ పోస్ట్ వద్ద భారత్‌కు అప్పగించింది. సుమారు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఆయనను పాక్ రేంజర్స్ అప్పగించారు. మరోవైపు భారత్ అదుపులో ఉన్న పాక్ రేంజర్స్‌ను కూడా భారత్ విడుదల చేసింది. కాగా, పూర్ణమ్ అనుకోకుండా పాక్ భూభాగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా, పంజాబ్‌లోని ఫిరోజ్ పూర్ సెక్టార్‌లో బీఎస్ఎఫ్ జవాన్, 182వ బెటాలియన్‌కు చెందిన పూర్ణమ్ కుమార్ సాహు విధులు నిర్వహిస్తున్నాడు. అయితే సరిహద్దుల్లో రైతులు పండించిన ధాన్యంకు గస్తీ నిర్వహిస్తున్నాడు. ఈ సమయంలో ఎండ వేడిమి తట్టుకోలేక అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో అక్కడ ఉన్న ఓ చెట్టు కిందకు వెళ్లి విశ్రాంతి తీసుకున్నాడు. కాగా, ఆ ప్రాంతం పాక్ సరిహద్దు అని గుర్తించలేక అనుకోకుండా అక్కడు నిద్ర పోయాడు.
ఈ విషయాన్ని గమనించిన పాకిస్థాన్ రేంజర్స్ అతడిని అదుపులోకి తీసుకున్నారు. సరిహద్దు క్రాస్ చేసిన కారణంగా బందించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇరు దేశాల భద్రతా దళాలు చర్చలు జరుపుతూనే ఉన్నారు. అయితే, ఆ తర్వాత భారత్, పాక్ మధ్య జరిగిన తీవ్ర ఉద్రిక్తతల కారణంగా విడుదల చేయలేదు. అనవసర విషయాలు చెబుతూ పెండింగ్ పెట్టారు ఈ నేపథ్యంలో జవాన్ కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళనకు గురయ్యారు.
ఇటీవల, కొంతమంది పాక్ రేంజర్లను బీఎస్ఎఫ్ అదుపులోకి తీసుకున్నారు. భారత్ సరిహద్దులో అనుమానంగా తిరగడంతో పట్టుకుంది. దీంతో ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. ఈ సమయంలోనే ఆయనను అక్కడికి అప్పగించగా.. బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణమ్ కుమార్ సాహును భారత్‌కు అప్పగించింది.