Published On:

IAEA: పాకిస్తాన్ కు అణు ముప్పు లేదు.. ఐఏఈఏ స్పష్టం

IAEA: పాకిస్తాన్ కు అణు ముప్పు లేదు.. ఐఏఈఏ స్పష్టం

Pakistan: పాకిస్తాన్ లో ఎలాంటి రేడియేషన్ లీకేజీ లేదని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చెప్పింది. అణ్వాయుధ నిల్వల నుంచి ఎలాంటి రేడియేషన్ రావడం లేదని, ఎలాంటి లీకేజీ లేదని చెప్పింది. కాగా పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ ప్రేరేపిత జైషే మహ్మద్ ఉగ్రవాదులు అమాయకులైన పర్యాటకులపై కాల్పులు జరపడంతో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ చర్యకు ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్ లో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు చేసింది. దాడుల్లో 100 మంది ముష్కరులు హతమయ్యారు.

 

అనంతరం భారత్ దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు చేసింది. అలాగే సరిహద్దు వెంబడి కాల్పులు ప్రారంభించింది. వీటిని భారత రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా తిప్పికొట్టింది. మరోవైపు పాకిస్తాన్ లోని పలు ప్రాంతాల్లో భారత్ దాడులు చేసింది. అయితే పాకిస్తాన్ లోని కిరాణా హిల్స్ లో ఉన్న అణ్వాయుధ నిల్వ కేంద్రం వద్ద దాడి జరిగినట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే అక్కడ అణ్వాయుధ నిల్వలు ఉన్నాయని, వాటి నుంచి స్వల్పంగా లీకేజీ జరగడంతో రేడియేషన్ రిలీజ్ అవుతున్నట్టు పుకార్లు వచ్చాయి. దీంతో వరల్డ్ ఎటామిక్ ఎనర్జీ సంస్థ రంగంలోకి దిగింది. అక్కడ పరిశోధన చేసి రేడియేషన్ లేదని స్పష్టం చేసింది.

 

అయితే కిరాణా హిల్స్ లోని అణ్వాయుధ స్థావరాలపై భారత్ దాడిచేసిందనే ఆరోపణలను భారత్ డీజీఎంఓ ఎయిర్ మార్షల్ ఏకే భార్తి ఖండించారు. అక్కడ తాము దాడులు చేయలేదని, ఆ ప్రాంతం ఎక్కడ ఉందో కూడా తెలియదని చెప్పుకొచ్చారు. సర్గోదా ఎయిర్ బేస్ పై ఇండియా దాడి చేసిందని.. అక్కడి నుంచి న్యూక్లియర్ స్టోరేజీ ఉన్న కిరాణా హిల్స్ కు లింక్ ఉందని భావిస్తున్నారు.