CWC Meeting: ఏఐసీసీ ఆఫీసులో మీటింగ్.. కాంగ్రెస్ నేతల హాజరు

Congress: ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసులో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ మీటింగ్ జరిగింది. భేటీకి కాంగ్రెస్ పెద్దలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ సీఎం సఖ్విందర్ సింగ్ సుఖ్ సహా.. పలువురు నేతలు హాజరయ్యారు.
సుమారు రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో పహల్గాం దాడి తర్వాత దేశంలో నెలకొన్న పరిస్థితులు, కులగణనకు కేంద్రం ఓకే చెప్పడంపై చర్చించారు. కాగా పహల్గాం దాడితో దేశంలో అలజడి రేపాలని చూస్తే సహించేదిలేదని.. ఇలాంటి చర్యలను రూపుమాపేందుకు కేంద్రంతో కలిసి పనిచేయాలని పార్టీ నేతలు నిర్ణయించారు. ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబాలను రాహుల్ గాంధీ పరామర్శించినట్టు చెప్పారు.
ప్రజా సమస్యలను నిజాయతీగా లెవనెత్తితే, ప్రభుత్వం తలవంచక తప్పదని రాహుల్ గాంధీ నిరూపించారని అన్నారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు వర్గీకరించాలని కాంగ్రెస్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. కులగణనపై కాంగ్రెస్ ఇప్పటికే ప్రాధాన్యత చాటుకుందన్నారు. కాంగ్రెస్ ఒత్తిడి వల్లే మోదీ ప్రభుత్వం కులగణనకు సిద్ధమైందన్నారు.