Published On:

BSF Sub Inspector MD Imteyaz Killed: పాక్ కాల్పుల్లో SI ఇంతియాజ్ వీరమరణం

BSF Sub Inspector MD Imteyaz Killed: పాక్ కాల్పుల్లో SI ఇంతియాజ్ వీరమరణం

BSF Sub Inspector MD Imteyaz Killed in Cross Boarder Firing: జమ్ముకాశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉద్రిక్త పరిస్థితులు మరోసారి నెలకొన్నాయి. ఆర్ఎస్ పురా సెక్టార్‌లో జరిగిన కాల్పుల్లో సరిహద్దు భద్రతా దళానికి చెందిన (BSF) సబ్ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ దేశం కోసం ప్రాణాలర్పించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. సబ్ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ ఆర్ఎస్ పురా సెక్టార్‌లోని ఒక బీఎస్ఎఫ్ సరిహద్దు ఔట్‌పోస్ట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో, సరిహద్దు ఆవలి నుంచి దుండగులు కాల్పులకు తెగబడ్డారు.

 

విధి నిర్వహణలో భాగంగా శత్రువులతో పోరాడుతూ, అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి మహమ్మద్ ఇంతియాజ్ అమరుడయ్యారని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సైన్యం ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. దేశ రక్షణ కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపింది. అమర జవాన్ ఇంతియాజ్‌ పార్థివదేహానికి జమ్మూలోని పలౌరాలో గల ఫ్రాంటియర్ హెడ్ క్వార్టర్స్‌లో పూర్తి సైనిక లాంఛనాలతో నివాళులర్పించే కార్యక్రమం జరగనుంది.

 

 

ఇవి కూడా చదవండి: