Published On:

Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ రికార్డు సెంచరీ.. నజరానా ప్రకటించిన బిహార్ సీఎం నితీశ్ కుమార్

Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ రికార్డు సెంచరీ.. నజరానా ప్రకటించిన బిహార్ సీఎం నితీశ్ కుమార్

Bihar government announces Rs.10 lakh compensation to Vaibhav Suryavanshi : ఐపీఎల్‌‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై బిహార్ సీఎం నితీశ్ కుమార్‌ ప్రశంసలు కురిపించారు. బిహార్‌కు చెందిన వైభవ్‌ రాజస్థాన్‌ రాయల్స్‌‌ జట్టు తరఫున ఆడుతున్నాడు. సోమవారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో చిచ్చరపిడుగు 35 బంతుల్లో సెంచరీ కొట్టి సంచలనం సృష్టించాడు. ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత క్రికెటర్ వైభవ్‌‌‌కే దక్కింది. దేశవ్యాప్తంగా వైభవ్‌‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బిహార్ సీఎం రూ.10 లక్షల నగదు బహుమతిని ప్రకటించారు. 2024లో వైభవ్‌ను కలిసిన ఫొటోలను నితీశ్ కుమార్ సోషల్ మీడియాలో పోస్టు చేసి అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో భారత్ తరఫున మరిన్ని రికార్డులు నెలకొల్పాలని ఆకాక్షించారు.

 

వైభవ్‌కు అభినందనలు..
ఐపీఎల్ చరిత్రలో 14 ఏళ్ల వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచిన బిహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీకి సీఎం నితీశ్ కుమార్ ఎక్స్‌లో అభినందనలు తెలిపారు. తన కృషి, ప్రతిభతో భారత క్రికెట్‌కు కొత్త ఆశాకిరణంగా మారాడని కొనియాడారు. తాను 2024లో వైభవ్‌, అతని తండ్రిని కలిసినట్లు పేర్కొన్నారు. అతడికి ఉజ్వల భవిష్యత్ ఉండాలని ఆకాంక్షించారు. ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన తర్వాత ఫోన్‌ చేసి అభినందించినట్లు తెలిపారు. సూర్యవంశీకి ప్రోత్సాహకంగా ప్రభుత్వం రూ.10 లక్షల నగదు బహుమతి అందజేయనుంది. అతడు భవిష్యత్‌లో ఇండియా జట్టు తరఫున ఆడి కొత్త రికార్డులు నెలకొల్పి దేశానికి కీర్తిని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు నితీశ్ ఎక్స్‌లో పేర్కొన్నారు.

 

 

ఇవి కూడా చదవండి: