JP Nadda: ఆప్ కు హిమాచల్ లో డిపాజిట్లు కూడా రావు.. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా
ఆప్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోతుందని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు.
New Delhi: ఆప్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోతుందని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. ఆదివారం కాంగ్రెస్ మరియు ఆమ్ ఆద్మీ పార్టీల పై విరుచుకుపడ్డారు మరియు గుజరాత్ మరియు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీజయం సాధిస్తుందని అన్నారు.
యూపీ ఎన్నికల్లో 350 స్థానాలకు గాను 349 స్థానాల్లో ఆప్ డిపాజిట్లు కోల్పోయిందని, గోవాలో 39 స్థానాలకు గాను 35 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయారని, ఈసారి హిమాచల్‌లో డిపాజిట్లు కూడ రావని నడ్డా అన్నారు. మొత్తం 67 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోతారని పేర్కొన్నారు. కేజ్రీవాల్ మొదట పార్టీ పెట్టనని చెప్పాడు, కానీ అతను పెట్టాడు. అతను ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పాడు. కానీ అతను చేసాడు. నేను భద్రత తీసుకోను అన్నాడు. పంజాబ్ పోలీసులతో తిరుగుతాడు, నేను కార్లు తీసుకోను అని చెప్పాడు. కానీ అతను చేసాడు, అతను ఢిల్లీలో వాటర్ మరియు ట్రాన్స్పోర్ట్ మాఫియాను అంతం చేస్తానని హామీ ఇచ్చాడు. కాని అతను లిక్కర్ మాఫియాను సృష్టించాడు మద్యం కుంభకోణం జరిగిందని ఆరో్పించారు.ఢిల్లీలో 20 కాలేజీలు, మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని, అదేమీ జరగలేదని, డిస్కమ్‌లపై ఆడిట్ చేస్తామని హామీ ఇచ్చారని, అయితే అది జరగలేదని నడ్డా అన్నారు. ఆప్ నేతలు చాలా మంది బెయిల్‌పై బయట ఉన్నారు. ఇది వారి విశ్వసనీయతను తెలుపుతోంది. అలాంటి వ్యక్తులను భారతదేశ ప్రజలు ఎన్నటికీ విశ్వసించరని అన్నారు.
గుజరాత్ లో తమ ప్రధాన ప్రత్యర్ది కాంగ్రెస్ మాత్రమేనని నడ్డా అన్నారు. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ను తపస్సు యాత్రగా నడ్డా అభివర్ణించారు. అతను మొదటిసారి రోడ్డు పైకి రావడం చాలా బాగుంది. ఇంతకుముందు, అతను ఇక్కడ 15 రోజులు ఉండి, 15 రోజులు విదేశాలకు వెళ్ళేవాడు. ఇది అతని రికార్డు అంటూ నడ్డా ఎద్దేవా చేసారు.