రాష్ట్రంలో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయి – మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

Ponguleti Srinivas Reddy Sensational Comments: తెలంగాణలో పోలిటికల్ బాంబులు పేలే అవకాశముందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా ప్రతినిథితో మాట్లాడుతూ ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రంలో పొలిటికల్ బాంబులు పెలబోతున్నాయి.. ఇందులో అందరూ ప్రధాన నేతలే ఉంటారన్నారు. ధరణి, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంతో పాటు పలు 10 అంశాల్లో నిజాలను ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచబోతున్నామంటూ బాంబ్ పేల్చారు. ప్రస్తుతం సియోల్ పర్యటనలో ఉన్న ఆయన హైదరాబాద్‌కు వెళ్లిన ఒకటి, రెండు రోజుల్లో బాంబులు పేలబోతున్నాయన్నారు.
తప్పు చేసిన వాళ్లు ఎంత పెద్దవాళ్లైన వదలమని, అది విదేశీ కంపెనీయా? వారిని ఎలా ట్రేసవుట్ చేయాలి.. వారి వెనక ఉన్న తొత్తులు ఎవరు, వారి మధ్య జరిగిన లావాదేవీలేమిటి.. అన్ని ఆధారాలతో సహా బయటపెట్టబోతున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అక్రమాలంటూ ఆరోపణలు చేయడమే తప్పా.. ఇప్పటి వరకు ఎలాంటి రుజువులు చూపలేకపోయిందనే అభిప్రాయాలు ఉన్నాయన్నారు. కానీ, ఈసారి అన్ని సాక్ష్యాధారాలతో బీఆర్‌ఎస్ నేత అక్రమాలను బయటపెడతామని, తెలంగాణ ప్రజలకు కోరుకున్న వార్తలు వినబోతున్నారంటూ మంత్రి పోంగులేటి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారాయి.