Last Updated:

Delhi Excise scam: ఎక్సైజ్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు జూలై 12 వరకు జ్యుడీషియల్ రిమాండ్

ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ కు రౌస్ అవెన్యూ కోర్టు జూలై 12 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. .జ్యుడీషియల్ కస్టడీ కోరుతూ రోస్ అవెన్యూ కోర్టుకు ఇచ్చిన దరఖాస్తులో, అరవింద్ కేజ్రీవాల్ దర్యాప్తుకు సహకరించడం లేదని తెలిపింది.

Delhi Excise scam: ఎక్సైజ్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు జూలై 12 వరకు జ్యుడీషియల్ రిమాండ్

Delhi Excise scam: ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ కు రౌస్ అవెన్యూ కోర్టు జూలై 12 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. .జ్యుడీషియల్ కస్టడీ కోరుతూ రోస్ అవెన్యూ కోర్టుకు ఇచ్చిన దరఖాస్తులో, అరవింద్ కేజ్రీవాల్ దర్యాప్తుకు సహకరించడం లేదని తెలిపింది.  ఉద్దేశపూర్వకంగా ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని సీబీఐ పేర్కొంది.

సహకరించడం లేదు..(Delhi Excise scam)

కేజ్రీవాల్ దర్యాప్తును ప్రభావితం చేయగల ప్రముఖ రాజకీయ వ్యక్తి. దర్యాప్తుకు సహకరించడం లేదు, అడిగిన ప్రశ్నలకు సరిగా సూటిగా సమాధానాలు ఇవ్వడం లేదని సీబీఐ తెలిపింది. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సౌత్ గ్రూప్‌కు చెందిన నిందితులు ఢిల్లీలో ఉన్నపుబు సవరించిన ఎక్సైజ్ డ్యూటీ పాలసీకి కేబినెట్ ఆమోదం ఒక్క రోజులోనే హడావుడిగా ఎందుకు పొందారో కూడా కేజ్రీవాల్ వివరించలేకపోయారు. అది కూడా తన సన్నిహితుడు విజయ్ నాయర్‌కు సంబంధించిన ప్రశ్నలను దాటవేసారని సీబీఐ కోర్టకు తెలిపింది.

ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో సిబిఐ అరెస్టు చేసిన తరువాత ఢిల్లీ కోర్టు బుధవారం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను మూడు రోజుల పాటు సిబిఐ కస్టడీకి పంపింది. ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. మార్చి 21న, ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అతన్ని అరెస్టు చేసింది. అయితే కేజ్రీవాల్ కు ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసినా ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది.

ఇవి కూడా చదవండి: