Telangana Lok Sabha Elections: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ .. చెరో 8 స్దానాల్లో గెలుపు ..
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ జరిగింది. రెండు పార్టీలు చెరో 8 సీట్లను గెలుచుకోగా మజ్టిస్ హైదరాబాద్ సీటును నిలుపుకుంది. రెండు పార్టీలకు గత పార్లమెంటు ఎన్నికల్లో పోల్చినపుడు సీట్లు పెరగడం విశేషం. మరోవైపు పదేళ్లపాటు రాష్ట్రంలో అధికారం చలాయించిన బీఆర్ఎస్ ఒక్క సీటును కూడా దక్కించుకోలేకపోయింది.
Telangana Lok Sabha Elections: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ జరిగింది. రెండు పార్టీలు చెరో 8 సీట్లను గెలుచుకోగా మజ్టిస్ హైదరాబాద్ సీటును నిలుపుకుంది. రెండు పార్టీలకు గత పార్లమెంటు ఎన్నికల్లో పోల్చినపుడు సీట్లు పెరగడం విశేషం. మరోవైపు పదేళ్లపాటు రాష్ట్రంలో అధికారం చలాయించిన బీఆర్ఎస్ ఒక్క సీటును కూడా దక్కించుకోలేకపోయింది.
బీజేపీ సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, మహబూబ్ నగర్, కరీనగర్, అదిలాబాద్, నిజామాబాద్, మెదక్ సీట్లను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, జహీరాబాద్, నాగర్ కర్నూలు, భువనగిరి, వరంగల్, నల్గొండ సీట్లను గెలుచుకుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్, గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి సీట్లను బీజేపీ గెలుచుకోవడం విశేషం. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వరునగా ఐదోసారి హైదరాబాద్ నుంచి పోటీ చేసి గెలిచారు.
లోక్‌సభ ఎన్నికల్లో ‘కారు‘ గల్లంతు..(Telangana Lok Sabha Elections)
లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతయింది. పార్టీ చరిత్రలోనే తొలిసారిగా ఒక్కస్థానం గెల్చుకోలేకపోయింది. దీనితో బీఆర్ఎస్ కు లోక్‌సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పార్టీ శ్రేణులను సమాయత్తం చేసినప్పటికీ ఎక్కడా గెలవలేకపోయింది. ఆరు నెలల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ కు ఇపుడు లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి మరింత నిరాశకు గురిచేసింది.
కంటోన్మెంట్ సీటు కాంగ్రెస్ దే..
హైదరాబాద్ నగరంలోని కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ది శ్రీ గణేష్ విజయం సాధించారు. ఆయన బీఆర్‌ఎస్ అభ్యర్థి దివంగత మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూతురు నివేదితపై 9,725 ఓట్లతో విజయం సాధించారు.కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతితో 2023లో జరిగిన ఎన్నికల్లో ఆయన పెద్ద కుమార్తె లాస్య నందిత బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి గెలిచింది. కాగా, కొన్ని నెలలకే సంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది.