Last Updated:

Mad Square Trailer: ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ ట్రైలర్‌ వచ్చేసింది – మరింత కామెడీతో ఆకట్టుకుంటున్న ట్రైలర్‌

Mad Square Trailer: ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ ట్రైలర్‌ వచ్చేసింది – మరింత కామెడీతో ఆకట్టుకుంటున్న ట్రైలర్‌

Mad Square Trailer Release: కామెడీ అండ్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన మ్యాడ్ చిత్రానికి సీక్వెల్‌గా మ్యాడ్‌ స్క్వేర్‌ తెరకెక్కింది. మరో రెండు రోజుల్లో ఈ సీక్వెల్‌ థియేటర్లోకి రాబోతోంది. ఎన్టీఆర్‌ బావమరిది నార్నే నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్ నితిన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా వస్తున్న మ్యాడ్‌ స్క్వేర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొన్ని రోజులుగా బాక్సాఫీసు వద్ద మంచి బజ్‌ ఉన్న చిత్రాలేవి లేవు.

దీంతో ఈ వారం రిలీజయ్యే సినిమాల్లో మ్యాడ్‌ స్క్వేర్‌పైనే అందరి ఫోకస్‌ ఉంది. మూవీ రిలీజ్‌ సందర్భంగా మూవీ టీం అంత ప్రమోషన్స్‌తో ఫుల్‌ బిజీగా ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సినిమా విడుదల ఇంకా రెండు రోజులే ఉండటంతో తాజాగా మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ చేసింది టీం. టీజర్‌ మొత్తం లడ్డు పెళ్లి గురించి చూపించి నవ్వులు పూయించారు. ఇప్పుడు ట్రైలర్‌ అతడి పెళ్లి క్యాన్సిల్‌ తర్వాత ప్రెండ్స్‌ అంతా కలిసి గోవా వెళతారు. అక్కడ ఫుల్‌గా చిల్ అవుతున్న వారిని పోలీసులు అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు.

ఈ నేపథ్యంలో ఓ గ్యాంబ్లింగ్‌లో చిక్కుకున్న వారి కోసం ఓ ముఠా వెతుకుంతుంది. ఆ తర్వాత ఏం జరగుతుందనేది సినిమా. ఈ క్రమంలో ప్రధాన పాత్రలు చేసిన అల్లరి, కామెడీ పంచ్‌లు, ప్రాసలు ఆద్యాంతం ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ మూవీపై అంచనాలు మరింత పెంచేస్తున్నాయి. కళ్యాణ్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర అండ్‌ సాయి సౌజన్యలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భీమ్స్‌ సిసిరోలి సంగీతం అందిస్తున్న ఈ సినిమా మార్చి 28న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది.