Last Updated:

Free Gas Cylinder: బిగ్ అలర్ట్.. ఉచిత సిలిండర్ బుకింగ్‌కు 5 రోజులే గడువు

Free Gas Cylinder: బిగ్ అలర్ట్.. ఉచిత సిలిండర్ బుకింగ్‌కు 5 రోజులే గడువు

Free Gas Cylinder Deepam 2 Scheme Apllying Last Date March 31: బిగ్ అలర్ట్. ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్‌కు గడువు మరో ఐదు రోజుల్లో ముగియనుంది. ఈ మేరకు ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ‘దీపం 2.0’ పథకం తొలి గ్యాస్ సిలిండర్ కోసం మార్చి 31 వరకే గడువు ఉందని తెలిపారు. ఈ పథకంతో ఇప్పటివరకు 98 లక్షల మందికిపైగా తొలి ఉచిత గ్యాస్ సిలిండర్లను సద్వినియోగం చేసుకున్నారని వెల్లడించారు.

 

మహిళలకు ఏడాదికి గానూ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు. ప్రతీ ఏటా ఏప్రిల్- జులై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి మధ్య బుకింగ్‌కు అవకాశం కల్పిస్తున్నామన్నారు. దీపం – 2 పథకానికి రూ.2,684 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. రేషన్ కార్డు ఉన్న వారందరూ ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు అర్హులని చెప్పారు.