Sobhita Akkineni: నక్క తోక తొక్కిన అక్కినేని కోడలు.. ఆ స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్.. ?

Sobhita Akkineni: అక్కినేని కోడలు శోభితా నక్కతోక తొక్కింది. ఏ ముహుర్తనా అమ్మడు అక్కినేని ఇంట అడుగుపెట్టిందో కానీ.. ఒక్కసారిగా స్టార్ గా మారిపోయింది. నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. పెళ్లి తరువాత కూడా నటించడానికి సిద్దమయ్యింది. పెళ్లి తరువాత నుంచి.. పార్టీలు, ఫంక్షన్స్, వెకేషన్స్ అంటూ తిరిగిన శోభితా.. ప్రస్తుతం కెరీర్ ను బిల్డ్ చేసుకొనే పనిలో పడింది.
అవ్వడానికి తెలుగు అమ్మాయి అయినా.. చైతో ప్రేమాయణం నడిపేవరకు అసలు అమ్మడు ఎవరు.. ? అన్న విషయం కూడా తెలుగువారికి తెలియదు. బాలీవుడ్ లో బోల్డ్ సిరీస్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన శోభితా తెలుగులో కేవలం రెండు సినిమాలకే పరిమితమయ్యింది. అడివి శేష్ నటించిన గూఢచారి, మేజర్ చిత్రాల్లో కీలక పాత్రల్లో మెరిసింది.
ఇక అక్కినేని ఇంటి కోడలిగా మారకా.. అమ్మడిని లక్ బంక పట్టుకున్నట్లు పట్టుకుంది. ఒకపక్క సోషల్ మీడియాలో ఫాలోవర్స్.. ఇంకోపక్క గూగుల్ సెర్చ్ లో కూడా స్టార్ గా నిలబడి షాక్ ఇచ్చిన ఈ భామ.. తాజాగా స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ పట్టేసింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో పా. రంజిత్ ఒకడు. అందరి సినిమాలు వేరు.. రంజిత్ సినిమాలు వేరు. ఎక్కడో మరుగున పడిపోయిన పాత కథలను.. అందులో ఉన్న నిజాన్ని ఎంతో అద్భుతంగా చూపిస్తాడు.
గతేడాది పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తంగలాన్ రిలీజ్ అయ్యి ఒక మోస్తరు టాక్ ను అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత అతని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వెట్టువమ్ . నటుడు గీతూ దినేష్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మధ్య ఓటీటీలో రిలీజ్ అయిన లబ్బరు పందు సినిమాలో హీరోయిన్ తండ్రిగా నటించిన నటుడే దినేష్. అతను హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్టార్ హీరో ఆర్య విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలోనే శోభితా హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందని టాక్ నడుస్తోంది.
తంగలాన్ కన్నా ముందే వెట్టువమ్ సినిమాను ప్రకటించాడు పా. రంజిత్. కాకపోతే కొన్ని కారణాల వలన ఈ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ ఏడాది ఈ సినిమా పట్టాలెక్కింది. ఒక దొంగ.. కొన్ని కారణాల వలన పోలీస్ గా మారితే..దాని వలన జరిగే పరిణామాలు ఏంటి అనేది కథగా తెలుస్తోంది. పా. రంజిత్ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది.
ఆ లెక్కన శోభితా పాత్ర కూడా చాలా గట్టిగానే ఉంటుంది అని అంటున్నారు. దీంతో ఈ చిన్నది మంచి ఛాన్స్ నే పట్టేసిందని టాక్. త్వరలోనే మేకర్స్ అధికారికంగా శోభితాను సినిమాలోకి ఆహ్వానించనున్నారట. పెళ్లి తరువాత శోభితా.. గ్లామర్ పాత్రలను వదిలేసి.. తన నటనకు మెరుగుపరిచే పాత్రలతో మెప్పించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి అక్కినేని కోడలి కోరిక ఈ సినిమాతో తీరుతుందో లేదో చూడాలి.