Jr NTR Wishes to Wife: భార్య ప్రణతి బర్త్‌డే – ఎన్టీఆర్ క్యూట్ విషెస్, పోస్ట్ చూశారా?

Jr NTR Wishes Wife Pranathi on Her Birthday: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీ ప్రమోషన్స్‌లో ఉన్నారు. జపాన్‌లో దేవర రిలీజ్ సందర్భంగా ఎన్టీఆర్ భార్య ప్రణతితో కలిసి జపాన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ జపాన్ ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తన భార్య ప్రణతి కోసం ఓ పోస్ట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నందమూరి అభిమానులను,నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
ఎన్టీఆర్ భార్య ప్రణతి పుట్టిన రోజు నేడు. మార్చి 26న ప్రణతి బర్త్‌డే సందర్భంగా జపాన్‌లో ఆమె పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో ఎన్టీఆర్, ప్రణతి అవుట్ అండ్ బ్లాక్ డ్రెస్‌లో మెరిసారు. బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ.. ‘అమ్మలు హ్యాపీ బర్త్‌డే’ అంటూ క్యూట్‌గా విషెస్ తెలిపారు. ఇక తారక్ తన భార్యను ప్రేమ అమ్మలు అని పిలవడం ఆకట్టుకుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ పోస్ట్ ఫ్యాన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే 2011లో ఎన్టీఆర్-ప్రణతిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
ఎంతో ఘనంగా జరిగిన ఈ పెళ్లికి అతిరథ మహారథులు హాజరయ్యారు. ప్రస్తుతం క్యూట్ కపుల్‌కి అభిరామ్ నందమూరి, భార్గవ్ రామ్ నందమూరిలు ఇద్దరు మగపిల్లలు సంతానం. ఇక తారక్ తన పర్సనల్ లైఫ్‌ని గొప్యంగా ఉంచుతారనే విషయం తెలిసిందే. వారి వ్యక్తిగత ప్రైవసీ కోసం భార్య, పిల్లలను మీడియాకు దూరంగా ఉంచుతారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తన బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘వార్ 2’ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ మొదలైంది. ఫిబ్రవరి చివరిలో ప్రారంభంలో సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్‌లో ఎన్టీఆర్ పాల్గొన్నట్టు సమాచారం.
View this post on Instagram
ఇవి కూడా చదవండి:
- Suhasini Maniratnam: ఆ విషయం చెబితే పరువు పోతుందని భయపడ్డాను – స్టార్ నటి సుహాసిని షాకింగ్ కామెంట్స్