Amit shah : నక్సల్ రహిత దేశంగా భారత్ మరో అడుగు.. కేంద్రమంత్రి అమిత్ షా

Amit shah : ఛతీస్‌గఢ్‌లో జరిగిన కాల్పుల్లో 22 మావోయిస్టులు మృతిచెందిన ఘటనపై కేంద్రమంత్రి అమిత్ షా స్పందించారు. భారత్‌ను నక్సల్ రహిత దేశంగా మార్చేందుకు చేపట్టిన ఆపరేషన్‌లో ఇది మరో పెద్ద విజయమన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నక్సలైట్ల పట్ల పఠిన వైఖరి అవలంబిస్తోందని పేర్కొన్నారు.
అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నా కొందరు నక్సలైట్లు లొంగిపోవడం లేదన్నారు. అలాంటి వారిపట్ల కేంద్ర ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోందన్నారు. మన సైనికులు ‘నక్సల్ ముక్త్ భారత్ అభియాన్’ దిశలో మరో పెద్ద విజయాన్ని సాధించారని కొనియాడారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, కాంకెర్‌లలో భద్రతా దళాలు నిర్వహించిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో 22 మంది నక్సలైట్లు మృతిచెందారని తెలిపారు. 2026 మార్చి 31 నాటికి దేశం మావోయిస్టు రహితంగా మారుతుందని ‘ఎక్స్’ వేదికగా అమిత్ షా పేర్కొన్నారు.
ఒకేరోజు బీజాపూర్, కాంకెర్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఈ కాల్పుల్లో 22 మంది నక్సలైట్లు మృతిచెందారు. ఎదురు కాల్పుల్లో ఓ జవాను మృతిచెందారు. విషయాన్ని అధికారులు వెల్లడించారు. బీజాపూర్-దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న గంగలూరు పరిధి అండ్రి అడవుల్లో నక్సల్స్ దాగినట్లు నిఘా సమాచారం వచ్చింది. ఈ సందర్భంగా జిల్లాల నుంచి సంయుక్త బలగాలు ఇవాళ ఉదయం నుంచి అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య భారీ ఎదురు కాల్పులు జరిగాయి. ఈ నేపథ్యంలోనే స్పందించిన అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.