Amala Paul About Sindhu Samaveli: తండ్రిలాంటి వ్యక్తితో అక్రమ సంబంధం – ఆ సినిమా చూసి మా నాన్న చాలా బాధపడ్డారు: అమలాపాల్

Amala Paul About sindhu Samaveli Controversy: అమలా పాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించింది. సినీరంగంలోకి అడుగుపట్టిన కొద్దికాలంలోనే స్టార్ నటిగా గుర్తింపు పొందింది. హీరోయిన్‌గా తన అందం, అభినయంతో మెప్పించడమే కాదు.. బోల్డ్ పాత్రల్లోనూ నటించి విమర్శలు ఎదుర్కొనేది. తరచూ తన కామెంట్స్, తెరపై తన పాత్రలతో తరచూ వార్తల్లో నిలిచే అమలాపాల్ ఇటీవల పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.
అంతేకాదు ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది ప్రస్తుతం పర్సనల్ లైఫ్‌తో బిజీగా ఉంది. మరోవైపు నిర్మాతగాను రాణిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న అమలా పాల్ కెరీర్‌లో ప్రారంభంలో తను తీసుకున్న తప్పుడు నిర్ణయాలపై స్పందించింది. తన పరిశ్రమలోకి వచ్చి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చింది. ఈ 15 ఏళ్లలో తన కెరీర్‌లో విజయాలతో పాటు ఎన్నో ఒడిదుడుకులు చూశానంది. తన ప్రయాణం ఎన్నో సవాళ్లతో నిండిందని చెప్పింది.
తనకు ఏమి తెలియని వయసులోనే సినిమాల్లోకి వచ్చానని, ఆ టైంలో తాను ఎంచుకున్న కథలు, పాత్రలు తన వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావితం చూపాయంది. నాకు అప్పుడు 17, 18 ఏళ్ల వయసులో తమిళంలో తను నటించిన ‘సింధు సమవేలి’లో సుందరి పాత్ర పోషించింది. ఇందులో ఆమె ఇబ్బందకరమైన శృంగార సన్నివేశాల్లో నటించింది. అప్పట్లో ఆమె పాత్రపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తాజా ఇంటర్య్వూలో అమలా పాల్ ఆ పాత్రను గుర్తు చేసుకుంది. ఆ టైంలో తను ఎదుర్కొన్న ప్రతికూల సంఘటనలను గుర్తు చేసుకుని ఇబ్బంది పడింది.
“ఆ సినిమా విషయంలో వచ్చిన విమర్శలు నన్ను ఎంతగానో బాధించాయి. సందరి పాత్రకు వచ్చిన ప్రతికూలత నన్ను ఎంతగానో భయపెట్టింది. ఇందులో తండ్రివయసు ఉన్నమమగారితో అక్రమ సంబంధం పెట్టుకునే మహిళా పాత్ర అది. ఆ సినిమా చూసి మా నాన్న తీవ్రంగా కలత చేందారు. ఆ వయసులో తెలియక ఆ పాత్ర ఒప్పుకున్నాను. దానివల్ల సమాజానికి ఏం వెళుతుంది, అలాంటి పాత్రలు చేయొచ్చా లేదా అనే అవగాహన కూడా నాకు లేదు. నా పాత్ర వల్ల వచ్చే సామాజిక ప్రభావాన్ని కూడా నేను అంచన వేయలేకపోయాను. ఇది చెడ్డది, అలాంటి పాత్రలు చేయకూడదనే ఆ సినిమా తర్వాత నాకు అర్థమైంది” అని ఆమె గుర్తు చేసుకుంది.