Last Updated:

TSRTC: టీఎస్ ఆర్టీసీ కార్మికులకు పెండింగ్​ డీఏ విడుదల

రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులకు 3.9 శాతం డీఏను శాంక్షన్ చేస్తూ మేనేజ్ మెంట్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

TSRTC: టీఎస్ ఆర్టీసీ కార్మికులకు పెండింగ్​ డీఏ విడుదల

Hyderabad: రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులకు 3.9 శాతం డీఏను శాంక్షన్ చేస్తూ మేనేజ్ మెంట్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ నెల వేతనంతో ఈ డీఏ కార్మికుల ఖాతాల్లోకి జమ అవుతుందని పేర్కొంది. ఈ నెల 21న ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మూడు డీఏలు ఇస్తామన్నారు. అయితే అదే రోజు సాయంత్రం అధికారులు మాత్రం 2 డీఏలకు మాత్రమే ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు బైపోల్​లో తమ నిరసన తెలుపుతామని హెచ్చరించారు.

మునుగోడు ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య పేరుతో కార్మికసంఘాలు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రచారానికి దిగటంతో మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు సమాఖ్య నేతలను పిలిపించి చర్చించారు. మునుగోడు బైపోల్​లో సుమారు 6,500 మంది ఆర్టీసీ కార్మికులకు ఓటు హక్కు ఉంది. ఇలాంటి పరిణామాలతో స్పందించిన ఆర్టీసీ డీఏకు ఓకే చెప్పింది.

 

ఇవి కూడా చదవండి: