Last Updated:

CWC Meetings: ఈ నెల 16, 17, 18 తేదీల్లో సీడబ్ల్యూసీ సమావేశాలు

సీడబ్ల్యూసీ సమావేశాల షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయి. 16న మధ్యాహ్నం ఒంటి గంటకు తెలంగాణ పీసీసీ లంచ్ ఏర్పాటు చేయనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభం కానుంది.

CWC Meetings: ఈ నెల 16, 17, 18 తేదీల్లో సీడబ్ల్యూసీ సమావేశాలు

CWC Meetings: సీడబ్ల్యూసీ సమావేశాల షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయి. 16న మధ్యాహ్నం ఒంటి గంటకు తెలంగాణ పీసీసీ లంచ్ ఏర్పాటు చేయనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభం కానుంది.

17న విజయభేరి సభ..(CWC Meetings)

17న ఉదయం పదిన్నరకు రెండో రోజు సీడబ్ల్యూసీ సభ్యుల మీటింగ్ జరగనుంది. 17న సాయంత్రం 5 గంటలకు విజయభేరి సభ నిర్వహించనున్నారు. విజయభేరి సభలో 5 గ్యారెంటీ స్కీమ్స్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఛార్జిషీట్‌ను ప్రకటిస్తారు. అనంతరం 119 నియోజకవర్గాలకు ముఖ్య నేతలు వెళ్లనున్నారు. రాత్రి అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే బస చేయనున్నారు. సెప్టెంబర్ 18 ఉదయం కార్యకర్తలతో కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు. డోర్ టూ డోర్ 5 గ్యారంటీ స్కీమ్స్‌ను తీసుకెళ్లడం.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఛార్జిషీట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం కార్యకర్తల ఇళ్లలో నేతలు లంచ్ చేయనున్నారు. సాయంత్రం భారత్ జోడో మార్చ్ చేస్తారు. గాంధీ, అంబేద్కర్, కొమురం భీం విగ్రహాల దగ్గరకు ర్యాలీలు నిర్వహించనున్నారు.