Last Updated:

Chandrababu Quash Petition: చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను కొట్టేసిన ఏపీ హైకోర్టు

టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట దక్కలేదు. సిఐడి తరపు న్యాయవాదుల వాదనలతో ఏపీ హైకోర్టు ఏకీభవించి పిటిషన్ ను కొట్టేసింది.

Chandrababu Quash Petition: చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను కొట్టేసిన ఏపీ హైకోర్టు

Chandrababu Quash Petition: టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట దక్కలేదు. సిఐడి తరపు న్యాయవాదుల వాదనలతో ఏపీ హైకోర్టు ఏకీభవించి పిటిషన్ ను కొట్టేసింది.

కేసును దర్యాప్తు చేయాలి..(Chandrababu Quash Petition)

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తుది తీర్పు వెలువడింది. ఈ కేసుకు సంబంధించి రెండేళ్లనుంచి సీఐడీ 140 మంది సాక్షులను విచారించిందని, 4 వేల డాక్యుమెంట్లను ఆధారాలుగా చూపించిందని పేర్కొంది. ఈ కేసును పూర్తిస్దాయిలో దర్యాప్తు జరపాల్సిన అర్హత ఉందన్న హైకోర్టు క్వాష్ పేరిట నిలిపివేయలేమని కోర్టు తెలిపింది.

సీఐడీ కస్టడీకి చంద్రబాబు..

మరోవైపు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును రెండు రోజులపాటు సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. చంద్రబాబును విచారణ జైల్లో చేస్తారా? తటస్ద ప్రదేశంలో చేస్తారా అంటూ జడ్జి ప్రశ్నించారు. సీఐడీ అధికారులు చెప్పినదాన్ని బట్టి ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. విచారించే అధికారుల జాబితాను కోర్టుకు ఇవ్వాలన్నారు.