YCP MP Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి బిగ్ షాక్.. హైకోర్టులో చుక్కెదురు

Big Shock To YCP MP Mithun Reddy : వైసీపీ ఎంపీకి బిగ్ షాక్ తగిలింది. ఎంపీకి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కావాలని వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కాగా, వైసీపీ హయాంలో మద్యం అమ్మకాలు, తయారీల అవకతవకలు జరిగాయి. ఇందులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ప్రమేయం ఉందంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. దీంతో ఈ కేసు విషయంలో ముందస్తు బెయిల్ కావాలంటూ బెయిల్ కోసం వైసీపీ ఎంపీ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా, విచారించిన హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.
ఇదిలా ఉండగా, రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొచ్చి రూ.4వేల కోట్ల మేర జరిగిన కుంభకోణంలో మిథున్‌రెడ్డితో మరికొంతమంది ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విషయంపై సీఐడీ ఇప్పటికే కేసు నమోదు చేయగా.. తనను అరెస్ట్ చేయవద్దని ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఎంపీ మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.