AP high court: అదానీతో విద్యుత్ ఒప్పందంపై హైకోర్టులో విచారణ.. అధిక ధరకు కొనాల్సిన అవసరం ఏముంది?
AP high court power deals with adani suchi deal: అదానీతో విద్యుత్ ఒప్పందంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే గత కొంతకాలంగా ఈ ఒప్పందంపై మొదటి నుంచి వ్యతిరేకతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ.. గతంలోనే టీడీపీ నేత పయ్యావుల కేశవ్, సీపీఐ నేత రామకృష్ణ పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే.
తాజాగా, ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్లు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ఆది నారాయణరావులు వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వినిపించారు. అయితే, ప్రభుత్వం తరఫున కౌంటర్ వేసేందుకు సమయం కావాలని ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు కేసు విచారణను రెండు వారాల వరకు వాయిదా వేయాలని కోరారు. దీంతో సంక్రాంతి సెలవుల తర్వాత తదుపరి విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.
కాగా, సెకి, అదానీ ద్వారా అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసేలా జరిగిన ఒప్పందాలపై విచారించాలని గతంలోనే పిల్ దాఖలైంది. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. గుజరాత్‌లో తయారైన విద్యుత్ ను ఏపీకి తీసుకొచ్చేందుకు అదనంగా చార్జీలు పడుతున్నాయని, ట్రాన్స్ మిషన్ చార్జీలతో పాటు వీలింగ్ ఛార్జీలు కూడా పడుతున్నాయని చెప్పారు. కేవలం మ్యానుఫ్యాక్చర్ ను ఉపయోగించి.. ఆదానీకి సెకీ నుంచి విద్యుత్ కొనుగోలు చేసుకున్నట్లు సమాచారం.
తక్కువ ధరకు విద్యుత్ దొరుకుతున్న సమయంలో అధిక ధరకు యూనిట్ కు రూ.2.49పైసలకు కొనాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. గుజరాత్ రాష్ట్రానికి యూనిట్ కు రూ.1.89పైసలుకు దొరుకుతుందని ధర్మాసనం ముందు వివరించారు. ఈ వ్యవహారంలో భారీగా ముడుపులు చేతులు మారాయని కోర్టు చార్జ్ సీటు లో నమోదైందని లాయర్ తెలిపారు. దీనిపై సంక్రాంతి సెలవుల తర్వాత విచారణ చేయనున్నట్లు కేసును వాయిదా వేసింది.