Published On:

ECIL Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగాలు, జీతం రూ.1,40,000.. ఈ అర్హత ఉంటే చాలు

ECIL Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగాలు, జీతం రూ.1,40,000.. ఈ అర్హత ఉంటే చాలు

ECIL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. బీటెక్ పాసైన వారికి ఇది సువర్ణవకాశం అనే చెప్పవచ్చు. HYD, ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ECIL) లో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలను గురించి తెలుసుకుందాం.

HYD, ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌‌లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రైనీ పోస్టుల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 16వ తేదీ నుంచి జూన్‌ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఉద్యోగ వెకెన్సీల సంఖ్య: 80

HYD, ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌‌లో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

పోస్టులు వారీగా వెకెన్సీలు:

గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ: 80 ఉద్యోగాలు

విభాగాలు:

ఈసీఈ/ఎలక్ట్రానిక్స్‌ & టెలీ కమ్యూనికేషన్‌, ఇనుస్ట్రుమెంటేషన్‌, సీఎస్‌ఈ/ఐటీ, మెకానికల్, ఈఈఈ/ఎలక్ట్రికల్‌, సివిల్‌, కెమికల్‌.

విద్యార్హతలు:

ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ పాసై ఉండాలి.

వయస్సు:

2025 ఏప్రిల్ 30వ తేదీ నాటికి 27 ఏళ్ల వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.40,000 – రూ.1,40,000 జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.

దరఖాస్తు ప్రక్రియ:

ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేది: 2025 మే 16

దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 5

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ:

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా..

ఎగ్జామ్ సెంటర్స్: బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ, కోల్ కతా

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు.

Also Read: BANK OF BARODA: బ్యాంక్ ఆఫ్ బరోడాలో పోస్టులు.. ఏపీ, తెలంగాణలోనూ ఖాళీలు, టెన్త్ పాసైతే చాలు

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం  వెకెన్సీల సంఖ్య: 80

దరఖాస్తుకు చివరి తేది: జూన్ 5

ఇవి కూడా చదవండి: