Volkswagen Virtus: అమ్మకాల్లో మెరుపులు.. వోక్స్‌వ్యాగన్ వర్టస్.. డిజైన్ అదిరిపోయింది..!

Volkswagen Virtus: భారత మార్కెట్లో వోక్స్‌వ్యాగన్ కార్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంది. మనం గత నెల అంటే ఏప్రిల్ 2025 గురించి మాట్లాడుకుంటే, వోక్స్‌వ్యాగన్ వర్టస్ కంపెనీ కార్ల అమ్మకాలలో అగ్రస్థానాన్ని సాధించింది. వోక్స్‌వ్యాగన్ వర్టస్ గత నెలలో మొత్తం 1,605 యూనిట్ల కార్లను విక్రయించింది. ఈ కాలంలో వోక్స్‌వ్యాగన్ వర్టస్ అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 35.67 శాతం పెరిగాయి. అయితే సరిగ్గా 1 సంవత్సరం క్రితం అంటే ఏప్రిల్, 2024లో ఈ సంఖ్య 1,183 యూనిట్లు. ఈ అమ్మకాలతో వోక్స్‌వ్యాగన్ వర్టస్ మార్కెట్ వాటా ఒక్కటే 56.30 శాతానికి చేరుకుంది. గత నెలలో కంపెనీ ఇతర మోడళ్ల అమ్మకాల గురించి వివరంగా తెలుసుకుందాం.
Volkswagen Virtus Sales
ఈ అమ్మకాల జాబితాలో వోక్స్‌వ్యాగన్ టిగువాన్ రెండవ స్థానంలో నిలిచింది. ఈ కాలంలో వోక్స్‌వ్యాగన్ టిగువాన్ మొత్తం 1,155 యూనిట్లను విక్రయించింది, ఇది సంవత్సరానికి 34.30 శాతం తగ్గుదలను నమోదు చేసింది. సరిగ్గా 1 సంవత్సరం క్రితం అంటే ఏప్రిల్ 2024లో ఈ సంఖ్య 1,758 యూనిట్లు. అదే సమయంలో, వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఈ అమ్మకాల జాబితాలో మూడవ స్థానంలో ఉంది. ఈ కాలంలో వోక్స్‌వ్యాగన్ టిగువాన్ మొత్తం 91 యూనిట్లను విక్రయించింది, ఇది సంవత్సరం ప్రాతిపదికన 15.74 శాతం తగ్గుదలతో ఉంది. అయితే సరిగ్గా 1 సంవత్సరం క్రితం అంటే ఏప్రిల్, 2024లో, ఈ సంఖ్య 108 యూనిట్లు.
Volkswagen Virtus Features
వోక్స్‌వ్యాగన్ వర్టస్ ఇంటీరియర్‌లో కస్టమర్లకు 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే , వైర్‌లెస్ ఛార్జింగ్, సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, అడ్జస్ట్ చేయగల డ్రైవర్ సీటు వంటి ఫీచర్లు ఇచ్చారు. దీనితో పాటు, భద్రత కోసం కారులో 6-ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉన్నాయి. వోక్స్‌వ్యాగన్ వర్టస్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర టాప్ మోడల్‌కు రూ. 11.56 లక్షల నుండి రూ. 19.40 లక్షల వరకు ఉంటుంది.
Volkswagen Virtus Engine
మరోవైపు, పవర్‌ట్రెయిన్ గురించి మాట్లాడుకుంటే, వోక్స్‌వ్యాగన్ వర్టస్ 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజాన్ గరిష్టంగా 115బిహెచ్‌పి పవర్, 178ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇది కాకుండా, ఈ కారులో 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది గరిష్టంగా 150బిహెచ్‌పి పవర్, 250ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ కారు ఇంజిన్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు రెండింటితో పనిచేస్తుంది. మార్కెట్లో వోక్స్‌వ్యాగన్ వర్టస్ హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా వంటి కార్లతో పోటీపడుతుంది.