Last Updated:

Vegetables : పచ్చి కూరగాయలు ఇలా తింటే మంచిదట !

కూరగాయలు రుచికరమైనప్పటికీ, పచ్చి కూరగాయల్లో ఎక్కువ ఫైబర్, పోషకాలను అందిస్తాయి.అందువల్ల వండిన వాటి కంటే పచ్చి కూరగాయలనే ఎక్కువుగా తినాలి.

Vegetables : పచ్చి  కూరగాయలు ఇలా తింటే మంచిదట !

Vegetables : పచ్చి కూరగాయల్లో పోషకాలను ఎక్కువుగా ఉంటాయి.మనం కూరగాయలను ఉడికించడం వల్ల విటమిన్స్, మినరల్స్ వంటి సహజ ఎంజైమ్స్ అన్నీ పోతున్నాయి.అంతేకాకుండా, నూనె, మసాలాలు ఆహారాల పోషకాలను ప్రభావితం చేస్తాయి.కూరగాయలు రుచికరమైనప్పటికీ, పచ్చి కూరగాయల్లో ఎక్కువ ఫైబర్, పోషకాలను అందిస్తాయి.అందువల్ల వండిన వాటి కంటే పచ్చి కూరగాయలనే ఎక్కువుగా తినాలి.

కూరగాయల్లోని పోషకాలు పోవడానికి గల కారణం వాటిని మనం అతిగా ఉడికించడం.చాలా మంది కూరగాయలను ముందుగా కట్ చేసి ఆ తర్వాత వాటిని కడిగి కూర చేసుకుంటారు.అలా కడిగినప్పుడు పోషకాలన్ని వెళ్ళిపోతాయి.దీని బదులు ముందుగానే కూరగాయలను కడగడం మంచిది.అప్పుడు అందులోని ఫైబర్ కూడా అలానే ఉంటుంది.అదే విధంగా చాలా మంది కూరగాయలను చాలా సార్లు నీటిలో నానబెడతారు.అలా ఎక్కువ శాతం నానబెట్టకూడదు.ఎందుకంటే కూరగాయల్లో అప్పటికే నీరు శాతం ఎక్కువుగా ఉంటుంది.ఇలా నీటిని నానబెట్టడం వల్ల ఖనిజాలన్ని పోతాయి.కూరగాయలు వండేటప్పుడు ఇలా చేయొద్దు.అప్పుడు అందులోని ఖనిజాలు అలానే ఉండిపోతాయి.

ఇవి కూడా చదవండి: