Unstoppable 2: పవన్ కళ్యాణ్ మాస్ ఎంట్రీ.. అదిరిపోయిన అన్ స్టాపబుల్ 2
Unstoppable 2: పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. బాలకృష్ణ వ్యాఖ్యతగా ఉన్న అన్ స్టాపబుల్ షో స్ట్రీమింగ్ మెుదలైంది. ఈ షో కు పవన్ కళ్యాణ్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు.

Unstoppable 2: పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. బాలకృష్ణ వ్యాఖ్యతగా ఉన్న అన్ స్టాపబుల్ షో స్ట్రీమింగ్ మెుదలైంది. ఈ షో కు పవన్ కళ్యాణ్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. నల్లరుంగు హుడితో మాస్ ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇక నందమూరి నటసింహం బాలకృష్ణ పవన్ ను నటుడు.. నాయకుడు.. ప్రజా సేవకుడు.. ప్రశ్నల యంత్రం.. విప్లవ యంత్రం అంటూ పొగిడారు. ఇక ఈ షో ను బాలయ్యా ఈ షో ను ఈశ్వరా.. పరమేశ్వరా.. పవరేశ్వరా అంటూ షో ను బాాలయ్య ప్రారంభించారు. పవన్ ను ఉద్దేశించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అదిరిపోయాయి.
పవన్ కళ్యాణ్ కొలతలను తీసుకోవాలంటూ.. ఈ షో ను సరదాగా బాలయ్య ప్రారంభించారు. ఈ షో కు పవన్ అభిమానులు ఎప్పటినుంచో వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఆ నిరీక్షణకు తెర పడింది. తమ అభిమాన నటుడిని ఇలా మెుదటి సారి షో లో చూడటంతో.. అభిమానుల ఆనందానికి అడ్డులేకుండా పోతోంది.
బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ 2 షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది.
సీజన్ 1 ని తనదైన శైలిలో బ్లాక్ బస్టర్ చేసిన బాలయ్య.. సీజన్ 2 ని ఒక రేంజ్ లో తీసుకెళ్తున్నారు.
అన్ స్టాపబుల్ సీజన్ 2 కి ఇదే చివరి షో కావడంతో.. భారీ రేంజ్ లో దీనిని ప్లాన్ చేశారు.
ఈ షో కు పవన్ కళ్యాణ్ రావడం.. మరో ఎత్తు. దీంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అన్ స్టాపబుల్ లో బాలకృష్ణ పవన్ అంతరంగాన్ని ఆవిష్కరించారు.
వ్యక్తిగత జీవితంతో పాటు.. సినిమా విశేషాలను పవన్ పంచుకున్నారు.
పవన్ చిన్ననాటి జీవితం.. సినిమా రంగంలోకి వచ్చిన మార్పులను అభిమానులకు తెలియజేశాడు.
తనలో జరిగిన మానసిక సంఘర్షణను పవన్ ఆవిష్కరించిన తీరు అద్భుతంగా ఉంది.
ఒకానొక సమయంలో.. తను గన్ పట్టుకున్న సమయాన్ని కూడా పవన్ అభిమానులకు తెలిపారు.
రామ్ చరణ్.. సాయి ధరమ్ తేజ్ లకు పవన్ Pawan Kalyan ఎలా సన్నిహితంగా మారారో ఇందులో చక్కగా వివరించారు.
రాజకీయాలు.. సమాజానికి చేయాల్సిన సేవను పవన్ ఈ షో లో తెలిపారు.
ఈ షో రెండు భాగాలుగా ఉండనుందని మనకు తెలుస్తుంది.
రెండో భాగంలో సాయి ధరమ్ తేజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు.
పవన్ కళ్యాణ్ తో పాటు సాయి ధరమ్ తేజ్ ఈ షో కు హైలెట్ అవ్వనున్నాడు.
మెుదటి భాగంలో వ్యక్తిగత జీవితం.. సినిమా విషయాలపై పవన్ పలు విషయాలను పంచుకున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/