Moon Nakshatra Transit: చంద్రుడి నక్షత్ర మార్పు.. 3 రాశుల వాళ్లు జాక్ పాట్ కొట్టినట్లే !

Moon Nakshatra Transit: దేశ వ్యాప్తంగా 5 మే 2025న బాగ్లాముఖి జయంతిని వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున.. బాగ్లాముఖి పూజ, ఉపవాసం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. బాగ్లముఖి జయంతికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ రోజున చంద్రుని రాశి, నక్షత్రరాశి మారుతున్నాయి. ఇది జ్యోతష్యశాస్త్రం ప్రకారం చాలా ప్రత్యేకమైనది.
చంద్రుడిని ఆలోచనలు, మనస్సు, ధైర్యం, ఆనందాన్ని ఇచ్చే దేవుడుగా భావిస్తారు. కాలానుగుణంగా గ్రహాలు రాశులు, నక్షత్రాలను మారుస్తుంటాయి. ఈ సంచారం రాశుల యొక్క జీవితంపై సానుకూల , ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. ఈసారి మే 5.. 2025న చంద్రుడు ఆశ్లేష నక్షత్రాన్ని వదిలి మాఘ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అదే సమయంలో.. చంద్రుడు కర్కాటక రాశి నుండి బయలుదేరి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సంచారం ముఖ్యంగా కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ రాశులేవో తెలుసుకుందామా..
వృషభ రాశి: చంద్రుడికి అత్యంత ఇష్టమైన రాశులలో ఒకటి వృషభ రాశి. ఈసారి బాగ్లముఖి జయంతి సందర్భంగా.. ఈ రాశి వారు చంద్ర సంచారం నుండి ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు. మీ ప్రేమ జీవితంలో కొంత గందరగోళం ఉంటే.. పూర్తిగా తొలగిపోతాయి. అంతే కాకుండా వివాహానికి అర్హత ఉన్నవారు కొన్ని శుభవార్తలు అందకుంటారు. మీ ఆరోగ్యం కూడా స్థిరంగా ఉంటుంది. మానసిక శాంతిని పొందుతారు. ఇటీవల ఇల్లు కొన్న వారు ఈ పవిత్రమైన రోజున గృహ ప్రవేశం చేయవచ్చు.
కర్కాటక రాశి:యచంద్రుడి సంచారం కర్కాటక రాశి వారికి అనేక లాభాలు అందిస్తుంది. కాబట్టి దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ బాగ్లముఖి జయంతి రోజు చంద్రుడి రాశి మార్పు కారణంగా..కర్కాటక రాశి వారికి ప్రత్యేక విజయం లభించే అవకాశం ఉంది. మీ అదృష్టం పెరుగుతుంది. అంతే కాకుండా అడ్డంకులను ఎదుర్కొంటున్న పనులు త్వరగా పూర్తవడం ప్రారంభిస్తాయి. వ్యాపారంలో లేదా వాణిజ్యంలో ఇబ్బంది పడుతున్న వారికి ఇప్పుడు వారి కష్టానికి పూర్తి ఫలితం లభిస్తుంది. ఇది వ్యాపారానికి కొత్త ఊపు తెస్తుంది. నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. బాగ్లముఖిని పూజించడం ద్వారా.. ప్రతికూలత తొలగిపోయి మంచి మార్గాలు తెరుచుకుంటాయి.
కన్య రాశి: కన్య రాశిపై చంద్రుడి ప్రభావం రెట్టింపు ఫలితాలను ఇస్తుంది. మీ కెరీర్లో గందరగోళం లేదా అడ్డంకులు ఉంటే.. అవి ఇప్పుడు తొలగిపోతాయి. ప్రభావవంతమైన వ్యక్తిని కలవడం మీ భవిష్యత్తుకు కొత్త దిశానిర్దేశం చేస్తుంది. ప్రేమ జీవితంలో కూడా మాధుర్యం అలాగే ఉంటుంది. వివాహంపై ఆసక్తి ఉన్న వారి సంబంధాన్ని ఖరారు అవుతాయి. ఈ రోజున చంద్రుడు , బాగ్లముఖి అమ్మవారి ఆశీస్సులతో.. మీ జీవితంలో కొత్త ప్రారంభం సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ సమయం మీలో ఆత్మవిశ్వాసాన్ని , ఆశను నింపుతుంది.