Last Updated:

RR vs DC: దిల్లీకి మూడో ఓటమి.. రాజస్థాన్ రాయల్స్ గ్రాండ్ విక్టరీ

RR vs DC: దిల్లీ క్యాపిటల్స్‌ వరుసగా రెండు మ్యాచుల్లోనూ ఓడిపోయింది. ఈసారి గెలిచి పాయింట్ల పట్టికలో ఖాతా తెరవాలని దిల్లీ భావిస్తోంది. ఈ క్రమంలో టాస్‌ నెగ్గిన దిల్లీ క్యాపిటల్స్ సారథి డేవిడ్ వార్నర్ బౌలింగ్‌ ఎంచుకున్నాడు.

RR vs DC: దిల్లీకి మూడో ఓటమి.. రాజస్థాన్ రాయల్స్ గ్రాండ్ విక్టరీ

RR vs DC: దిల్లీతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్ లో 57 పరుగుల తేడాతో గెలుపొందింది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 08 Apr 2023 07:22 PM (IST)

    RR vs DC: దిల్లీకి మూడో ఓటమి.. రాజస్థాన్ రాయల్స్ గ్రాండ్ విక్టరీ

    దిల్లితో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ 20 ఓవర్లలో 142 పరుగులు మాత్రమే చేయగలిగింది.

  • 08 Apr 2023 07:01 PM (IST)

    RR vs DC: వార్నర్ ఔట్.. ఓటమి దిశగా దిల్లీ క్యాపిటల్స్

    నిలకడగా ఆడుతున్న వార్నర్ ఔటయ్యాడు. 49 బంతుల్లో 61 పరుగులు చేశాడు.

  • 08 Apr 2023 06:51 PM (IST)

    RR vs DC: డెవిడ్ వార్నర్ అర్దసెంచరీ.. బ్యాటింగ్ కి వచ్చిన పావెల్

    రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో వార్నర్ అర్దసెంచరీ సాధించాడు.

  • 08 Apr 2023 06:48 PM (IST)

    RR vs DC: అక్షర్ పటేల్ ఔట్.. ఐదో వికెట్ కోల్పోయిన దిల్లీ

    దిల్లీ ఐదో వికెట్ కోల్పోయింది. చాహాల్ బౌలింగ్ లో అక్షర్ పటేల్ స్టంపౌట్ అయ్యాడు. 111 పరుగుల వద్ద దిల్లీ ఐదో వికెట్ కోల్పోయింది.

  • 08 Apr 2023 06:37 PM (IST)

    RR vs DC: నాలుగో వికెట్ డౌన్.. లలిత్ యాదవ్ క్లీన్ బౌల్డ్

    దిల్లీ నాలుగో వికెట్ కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్ లో లలిత్ యాదవ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 24 బంతుల్లో లలిత్ 38 పరుగులు చేశాడు. క్రీజులోకి అక్షర్ పటెల్ వచ్చాడు.

  • 08 Apr 2023 06:27 PM (IST)

    RR vs DC: 11 ఓవర్లు.. 83 పరుగులు చేసిన దిల్లీ

    11 ఓవర్లు ముగిసేసరికి దిల్లీ మూడు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. క్రీజులో లలిత్, వార్నర్ ఉన్నారు.

  • 08 Apr 2023 06:14 PM (IST)

    RR vs DC: ఐపీఎల్ లో 6వేల పరుగులు పూర్తి చేసుకున్న డెవిడ్ వార్నర్

    ఐపీఎల్ లో డెవిడ్ వార్నర్ 6వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. రాజస్థాన్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు.

  • 08 Apr 2023 06:12 PM (IST)

    RR vs DC: 8 ఓవర్లకు 48 పరుగులు చేసిన దిల్లీ.. కట్టుదిట్టంగా రాయల్స్ బౌలింగ్

    రాయల్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. దీంతో పరుగులు చేయడానికి దిల్లీ బ్యాటర్లు కష్టపడుతున్నారు. ప్రస్తుతం 8 ఓవర్లకు దిల్లీ 48 పరుగులు చేసింది. క్రీజులో వార్నర్, లలిత్ ఉన్నారు.

  • 08 Apr 2023 06:01 PM (IST)

    RR vs DC: మూడో వికెట్ డౌన్.. పీకల్లోతు కష్టాల్లో దిల్లీ

    దిల్లీ ముడో వికెట్ కోల్పోయింది. రూస్సోవ్ అశ్విన్ బౌలింగ్ లో క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో ఆ జట్టు 36 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.

  • 08 Apr 2023 05:50 PM (IST)

    RR vs DC: రెండు వికెట్లు డౌన్.. కష్టాల్లో దిల్లీ క్యాపిటల్స్

    200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ కష్టాల్లో పడింది. 15 పరుగలకే ఆ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. పృథ్వి షా, మనీష్ పాండే ఇద్దరు డకౌట్ గా వెనుదిరిగాడు.

  • 08 Apr 2023 05:17 PM (IST)

    RR vs DC: రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్.. దిల్లీ లక్ష్యం 200 పరుగులు

    రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. జైస్వాల్, బట్లర్ రాణించగా.. చివర్లో హెట్ మేయర్ విశ్వరూపం చూపించాడు. జైస్వాల్ 60 పరుగులు చేయగా.. బట్లర్ 79 పరుగులు చేశాడు. చివర్లో హెట్ మేయర్ నాలుగు సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. దీంతో రాయల్స్ భారీ స్కోర్ సాధించింది.

    దిల్లీ జట్టులో ముఖేష్ కుమార్ రెండు వికెట్లు తీసుకోగా.. కుల్దీప్, పావెల్ చెరో వికెట్ తీసుకున్నారు.

  • 08 Apr 2023 05:03 PM (IST)

    RR vs DC: 18 ఓవర్లకు 168 పరుగులు చేసిన రాయల్స్..

    18 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి రాయల్స్ 168 పరుగులు చేసింది. క్రీజులో బట్లర్, హెట్ మేయర్ ఉన్నారు.

     

  • 08 Apr 2023 04:49 PM (IST)

    RR vs DC: 15 ఓవర్లకు 130 పరుగులు చేసిన రాయల్స్..

    15 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి రాయల్స్ 130 పరుగులు చేసింది. క్రీజులో బట్లర్, హెట్ మేయర్ ఉన్నారు.

  • 08 Apr 2023 04:43 PM (IST)

    RR vs DC: రియాన్ పరాగ్ క్లీన్ బౌల్డ్.. మూడో వికెట్ కోల్పోయిన రాయల్స్

    రాజస్థాన్ రాయల్స్ మూడో వికెట్ కోల్పోయింది. పావెల్ బౌలింగ్ లో రియాన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పరాగ్ 11 బంతుల్లో 7 పరుగులు చేశాడు.

  • 08 Apr 2023 04:35 PM (IST)

    RR vs DC: జోస్ బట్లర్ జోరు.. 32 బంతుల్లో అర్దసెంచరీ

    జోస్ బట్లర్ అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 32 బంతుల్లో 51 పరుగులు చేశాడు.

  • 08 Apr 2023 04:33 PM (IST)

    RR vs DC: 12 ఓవర్లకు 112 పరుగులు చేసిన రాయల్స్

    12 ఓవర్లు ముగిసేసరికి రాయల్స్  112 పరుగులు చేసింది.

  • 08 Apr 2023 04:27 PM (IST)

    RR vs DC: పది ఓవర్లు.. 103 పరుగులు చేసిన రాయల్స్

    పది ఓవర్లకు రాజస్థాన్ 103 పరుగులు చేసింది. రెండు వికెట్లు కోల్పోయింది.

  • 08 Apr 2023 04:25 PM (IST)

    RR vs DC: సంజు శాంసన్ డకౌట్.. రెండో వికెట్ కోల్పోయిన రాయల్స్

    రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండో వికెట్ కోల్పోయింది. జట్టు కెప్టెన్ శాంసన్ డకౌయ్ అయ్యాడు. కుల్దిప్ యాదవ్ బౌలింగ్ లో నోర్జియాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 103 పరుగుల వద్ద రెండో వికెట్ పడింది.

  • 08 Apr 2023 04:18 PM (IST)

    RR vs DC: తొలి వికెట్ కోల్పోయిన రాయల్స్.. జైస్వాల్ ఔట్

    రాజస్థాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. ముఖేష్ యాదవ్ బౌలింగ్ లో క్యాచ్ ఔట్ అయ్యాడు. యశస్వి 31 బంతుల్లో 60 పరుగులు చేశాడు. దీంతో 98 పరుగుల వద్ద రాజస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది.

  • 08 Apr 2023 04:13 PM (IST)

    RR vs DC: పరుగుల వరద.. 8 ఓవర్లకు 96 పరుగులు

    రాజస్థాన్ బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్నారు. ఇద్దరు పోటీ పడి పరుగులు చేస్తున్నారు. దీంతో 8 ఓవర్లకు 96 పరుగులు చేసింది.

  • 08 Apr 2023 04:10 PM (IST)

    RR vs DC: పరుగుల వరద.. అర్దసెంచరీ చేసిన జైస్వాల్

    యశస్వి జైస్వాల్ పరుగుల వరద పారిస్తున్నాడు. 27 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఇందులో 11 ఫోర్లు ఉన్నాయి.

  • 08 Apr 2023 04:09 PM (IST)

    RR vs DC: ముగిసిన ఏడో ఓవర్.. 79 పరుగులు చేసిన రాయల్స్

    ఏడు ఓవర్లకు రాయల్స్ 79 పరుగులు చేసింది. అక్షర్ వేసిన ఓవర్లో 11 పరుగులు వచ్చాయి.

  • 08 Apr 2023 04:03 PM (IST)

    RR vs DC: ముగిసిన పవర్ ప్లే.. 68 పరుగులు చేసిన రాయల్స్

    పవర్ ప్లే ముగిసేసరికి రాయల్స్ 68 పరుగులు చేసింది. ఇందులో జైస్వాన్ 41 పరుగులు చేయగా.. బట్లర్ 24 పరుగులు చేశాడు.

  • 08 Apr 2023 03:58 PM (IST)

    RR vs DC: బౌండరీల వరద.. 5 ఓవర్లకు 63 పరుగులు చేసిన రాయల్స్

    రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు బౌండరీల వరద పారిస్తున్నారు. కేవలం 5 ఓవర్లలో 63 పరుగులు చేశారు.

  • 08 Apr 2023 03:54 PM (IST)

    RR vs DC: నాలుగు ఓవర్లు.. 50 పరుగులు చేసిన రాయల్స్

    నాలుగు ఓవర్లకే రాయల్స్ 50 పరుగులు చేసింది. ఖలీల్ వేసిన ఓవర్లో 11 పరుగులు వచ్చాయి.

  • 08 Apr 2023 03:46 PM (IST)

    RR vs DC: మూడు ఓవర్లు.. 39 పరుగులు

    మూడు ఓవర్లు ముగిసేసరికి రాయల్స్ 39 పరుగులు చేసింది. ఓపెనర్లు పోటిపడి మరి పరుగులు సాధిస్తున్నారు. ముఖేష్ కుమార్ వేసిన మూడో ఓవర్లో 7 పరుగులు వచ్చాయి.

  • 08 Apr 2023 03:43 PM (IST)

    RR vs DC: విధ్వంసం.. రెండు ఓవర్లలో 32 పరుగులు

    రెండో ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. రెండు ఓవర్లకు రాయల్స్ 32 పరుగులు చేసింది.

  • 08 Apr 2023 03:36 PM (IST)

    RR vs DC: తొలి ఓవర్.. 20 పరుగులు చేసిన రాయల్స్

    ఖలీక్ అహ్మద్ వేసిన తొలి ఓవర్లో ఏకంగా 20 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్ల యశస్వి జైస్వాల్ 5 ఫోర్లు కొట్టాడు. క్రీజులో జోస్ బట్లర్, జైస్వాల్ ఉన్నారు.

  • 08 Apr 2023 03:33 PM (IST)

    RR vs DC: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దిల్లీ.. టీం ఇదే

    రాజస్థాన్ రాయల్స్ జట్టు: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, సిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

    ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మనీశ్ పాండే, రిలీ రోసోవ్, రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, అభిషేక్ పోరెల్ , అన్రిచ్ నార్ట్ జే, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, ముఖేశ్ కుమార్