Presidential Elections 2022: ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్
భారత 15వ రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీలో నిలబడ్డారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన రాజ్యసభ సెక్రెటరీ జనరల్ ఆధ్వర్యంలో ఈ నెల 21న పార్లమెంటులో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజు రాత్రి ఫలితాలను
New Delhi: భారత 15వ రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీలో నిలబడ్డారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన రాజ్యసభ సెక్రెటరీ జనరల్ ఆధ్వర్యంలో ఈ నెల 21న పార్లమెంటులో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజు రాత్రి ఫలితాలను ప్రకటిస్తారు. ఈనెల 25న 15వ రాష్ట్రపతిగా గెలిచిన అభ్యర్థి ప్రమాణస్వీకారం చేస్తారు.
భారత రాష్ట్రపతి ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రారంభం కాగానే, పార్లమెంట్ హాల్ లో ప్రధాని మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్రమంత్రులు అమిత్ షా, యూపీ సీఎం యోగీ, సోనియా, రాహుల్ గాంధీలతో పాటు విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా కుమారుడు, బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా ఓటు వేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్ హాల్ కు వీల్ ఛైర్ లో వచ్చి ఓటేశారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ముగిసింది. హైదరాబాద్, అమరావతిలోని అసెంబ్లీల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీలో సీఎం జగన్, తెలంగాణలో మంత్రి కేటీఆర్ తొలి ఓటు వేశారు. మధ్యాహ్నం తర్వాత సీఎం కేసీఆర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏపీ, తెలంగాణ మంత్రులు ఒక్కొక్కరుగా ఓటు వేశారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు. ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ కార్యాలయం నుంచి అసెంబ్లీకి చేరుకుని ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల సంఘం ప్రత్యేక అనుమతితో ఆంధ్రప్రదేశ్‌లోని కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి తెలంగాణ శాసనసభలో ఓటు వేశారు.