Last Updated:

Maharastra: రాత్రి 7 అయితే ఆ ఊర్లో టీవీలు, సెల్‌ఫోన్లు అన్నీ బంద్..!

కరోనా సమయం నుంచి విద్యార్థులు చరవాణీల వాడకం పెరిగిపోయింది. ఆన్‌లైన్ క్లాసుల పుణ్యమా అని పిల్లలకు తల్లిదండ్రులు సెల్‌ఫోన్లు కొనిచ్చారు. దానితో పిల్లలు మొబైళ్లకు బానిసలయ్యారు. ఇది ఇలాగే కొనసాగితే వారి భవిష్యత్ నాశనం అవుతుందని భావించిన మహారాష్ట్ర సంగ్లీ జిల్లాలోని ఓ గ్రామం వినూత్న నిర్ణయం తీసుకుంది. అది ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తోంది. మరి ఆ నిర్ణయం ఏంటో చూసేద్దామా.

Maharastra: రాత్రి 7 అయితే ఆ ఊర్లో టీవీలు, సెల్‌ఫోన్లు అన్నీ బంద్..!

Maharastra: కరోనా సమయం నుంచి విద్యార్థులు చరవాణీల వాడకం పెరిగిపోయింది. ఆన్‌లైన్ క్లాసుల పుణ్యమా అని పిల్లలకు తల్లిదండ్రులు సెల్‌ఫోన్లు కొనిచ్చారు. దానితో పిల్లలు మొబైళ్లకు బానిసలయ్యారు. ఇది ఇలాగే కొనసాగితే వారి భవిష్యత్ నాశనం అవుతుందని భావించిన మహారాష్ట్ర సంగ్లీ జిల్లాలోని ఓ గ్రామం వినూత్న నిర్ణయం తీసుకుంది. అది ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తోంది. మరి ఆ నిర్ణయం ఏంటో చూసేద్దామా.

మహారాష్ట్ర సంగ్లీ జిల్లాలోని కాడేగావ్ మండలంలోని మోహిత్యాంచె వడ్గావ్ గ్రామంలో సుమారు 3,105 జనాభా నివాసం ఉంటున్నారు. కాగా వీరు లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్ పాఠాలు వినేందుకు తమ పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు కొనిచ్చారు. దానితో పిల్లలు ఎప్పుడు చూసినా మొబైల్ ‌ఫోన్‌తోనే కనిపించారు. దానితో తల్లిదండ్రుల్లో పిల్లల భవిష్యత్ పై ఆందోళన మొదలైంది. మరోవైపు, మహిళలేమో టీవీ సీరియళ్లు చూడడంలో మునిగిపోయేవారు. ఇది ఇలాగే కొనసాగితే ప్రమాదమని, పిల్లల భవిష్యత్ నాశనమవుతుందని భావించిన గ్రామ సర్పంచ్ విజయ్ మోహితే ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా ఆగస్టు 15న గ్రామంలోని మహిళలు అందరితో సమావేశమయ్యారు.

ప్రతి రోజు రాత్రి 7 గంటల నుంచి 8.30 గంటల మధ్య టీవీలు, సెల్‌ఫోన్లు ఆఫ్ చేయాలని తీర్మానించారు. ఈ తీర్మానాన్ని అమలు చేసే బాధ్యతను గ్రామంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, పంచాయతీ సభ్యులకు అప్పగించారు. అప్పటి నుంచి రోజూ రాత్రి ఏడు గంటలు కాగానే గ్రామంలో ఓ సైరన్ మోగుతుంది. అంతే ఇంక సెల్ఫ్‌ఫోన్లు టీవీలు ఆఫ్ అవుతాయి. పిల్లలు శ్రద్ధగా హోం వర్కులు చేసుకుంటారు. మహిళలు ఇంటి పనులు చూసుకుంటారు. గ్రామస్థులు ఈ విషయంలో తొలుత ఇబ్బంది పడినా ఆ తర్వాత దీనికి అలవాటు పడిపోయారు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల జిల్లాల వారు సర్పంచ్ విజయ్ మోహితే నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.

ఇదీ చదవండి: ఈ పింక్ స్టార్ డైమండ్ వజ్రాల రారాజు.. ఎందుకో తెలుసా..?

ఇవి కూడా చదవండి: