SBI Recruitment: SBIలో 2964 ఉద్యోగాలు.. ఏపీ, తెలంగాణలోనూ ఖాళీలు.. పూర్తి వివరాలివే..?

SBI Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది శుభవార్త. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్ న్యూస్ అని చెప్పవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది.
ముంబయి, దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం వెకెన్సీల సంఖ్య: 2964
తెలుగు రాష్ట్రాల్లో కూడా జాబ్ వెకెన్సీలు ఉన్నాయి. హైదరాబాద్ సర్కిల్ లో 233 ఉద్యోగాలు, అమరావతి సర్కిల్ లో 186 ఉద్యోగాలు వెకెన్సీలు ఉన్నాయి.
విద్యార్హత:
ఏదైనా విభాగంలో డిగ్రీ పాసైన అభ్యర్థులు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా చూస్తారు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 మే 9
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 29
రాష్ట్రాల వారీగా ఖాళీలను చూసినట్లయితే..
అహ్మదాబాద్- 240, ఆంధ్రప్రదేశ్- 180, కర్ణాటక- 250, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్- 200, ఒడిశా- 100, హరియాణా- 306, జమ్ము & కశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, పంజాబ్- 80, తమిళనాడు, పుదుచ్చేరి- 120, నార్త్ ఈస్ట్రన్- 100, తెలంగాణ- 230, రాజస్తాన్- 200, కోల్‌కతా- 150, లఖ్‌నవూ-280, మహారాష్ట్ర- 250, ముంబయి మెట్రో(మహారాష్ట్ర, గోవా)- 100, న్యూదిల్లీ- 30, తిరువనంతపురం- 90 వెకెన్సీ ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో వెకెన్సీలు చూస్తే..
తెలంగాణ హైదరాబాద్ సర్కిల్ లో 233 పోస్టులున్నాయి.
ఆంధ్రప్రదేశ్ అమరావతి సర్కిల్ లో 186 పోస్టులున్నాయి.
వయోపరిమితి:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే.. అభ్యర్థుల వయస్సు 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 1995 మే 1 నుంచి 2004 ఏప్రిల్ 30 మధ్య జన్మించి ఉండాలి.
రూల్స్ ప్రకారం వయస్సు సడలింపు
ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
ఓబీసీలకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
పీడీబ్ల్యూడీ (జనరల్/ ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
వేతనం:
సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.48,480 జీతం ఉంటుంది.
జాబ్ సెలెక్ట్ విధానం:
ఆన్ లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా..
ప్రిలిమినరీ ఎగ్జామ్:
ఆబ్జెక్టివ్ విధానంలో 120 మార్కులకు ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఇందులో నాలుగు విభాలుండగా.. ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 30 ప్రశ్నలకు.. 30 మార్కులు; బ్యాంకింగ్ నాలెడ్జ్ నుంచి 40 ప్రశ్నలు.. 40 మార్కులు, జనరల్ అవేర్‌నెస్/ ఎకానమీ నుంచి 30 ప్రశ్నలకు 30 మార్కుల ఉంటాయి. కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 20 ప్రశ్నలు 20 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 2 గంటలు ఉంటుంది. నెగిటివ్ మార్కుల విధానం కూడా అమల్లో ఉంటుంది.
ఎగ్జామ్ సెంటర్స్:
హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, అనంతపురం, గుంటూరు/ విజయవాడ, కర్నూలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఎగ్జామ్ సెంటర్లు ఉంటాయి.
దరఖాస్తు విధానం:
ఆన్ లైన్‌లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఇతరలకు రూ.750 ఫీజు ఉంటుంది.
ఎగ్జామ్ ఎప్పుడు..?
జులై నెలలో ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది.
నోటిఫికేష్ ముఖ్య సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్‌ను సంప్రదించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://sbi.co.in
నోటిఫికేషన్ ఇంపార్టెంట్ సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 2964
దరఖాస్తుకు ప్రారంభ తేది: మే 9
దరఖాస్తుకు చివరి తేది: మే 29
జీతం: రూ.48,480
Also Read: ECIL Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగాలు, జీతం రూ.1,40,000.. ఈ అర్హత ఉంటే చాలు