Last Updated:

Hyderabad IT Raids: హైదరాబాద్ లో రెండవరోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు

హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి.హైదరాబాద్​లో ప్రముఖ బిల్డర్ వంశీరామ్ బిల్డర్స్ ఎండీ సుబ్బారెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు రెండవరోజు కూడ ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు

Hyderabad IT Raids: హైదరాబాద్ లో రెండవరోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు

Hyderabad: హైదరాబాద్ లో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్​లో ప్రముఖ బిల్డర్ వంశీరామ్ బిల్డర్స్ ఎండీ సుబ్బారెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు రెండవరోజు కూడ ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున నుండే ఈ సోదాలు ప్రారంబించారు. ఇటీవల చేసిన ప్రాజెక్ట్ నిర్మాణాల్లో భారీ లాభాలు ఆర్జించిన వంశీరామ్ బిల్డర్స్ దానికి తగ్గ ట్యాక్స్ ఎగవేత వేసినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు, కంపెనీ ఉద్యోగుల పేరు మీద బ్యాంకు ఖాతాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

వంశీరామ్ గ్రూప్ చైర్మన్ సుబ్బారెడ్డి, అతని బావమరిది జనార్ధన్ రెడ్డి నివాసాలతో వారి సన్నిహితుల ఇళ్లపైనా సోదాలు జరిగాయి. సుబ్బారెడ్డి కార్యాలయాలు, నందగిరి హిల్స్, పెద్దమ్మ గుడి సమీపంలోని స్థలాల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సుబ్బారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్న 18 కంపెనీలకు చెందిన ఆస్తులపై సోదాలు జరిగినట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌లు, పెన్ డ్రైవ్‌లు, ఇతర మెటీరియల్‌లను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. రెండు సూట్‌కేసుల్లో పత్రాలను ఐటీ ఆఫీసుకు తరలించారు.

మరోవైపు విజయవాడ, నెల్లూరులోని వైసీపీ నేత దేవినేని అవినాష్, సుబ్బారెడ్డి బంధువుల కార్యాలయాల్లో నాలుగు ఐటీ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఈ క్రమంలోనే మూడు హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి: