Dil Raju: ‘దిల్’ రాజును ఎస్‌వీసీ ఆఫీసుకు తీసుకువెళ్లిన ఐటీ అధికారులు
It Raids on Dil Raju Office: టాలీవుడ్ నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్ ‘దిల్’ రాజు ఇళ్లు, ఆఫీసులలో నాలుగో రోజు ఐటీ సోదాలు జరుగుతున్నాయి. తనిఖీల్లో భాగంగా ఇప్పటికే భారీగా పలు డాక్యుమెంట్స్‌ని అధికారుల స్వాధీనం చేసుకున్నారు. తాజాగా దిల్ రాజును ఆయన నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌కు సంబంధించిన ఆఫీసు ఆదాయపన్ను శాఖ అధికారులు తీసుకువెళ్లారు. దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు దాదాపు ముగిశాయి. నాలుగు రోజుల పాటు కొనసాగిన ఈ సోదాలో పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఒక మహిళా అధికారి సమక్షంలో ఈ సోదాలు జరగుతున్నాయి. దిల్ రాజు నివాసం నుంచి వారు తాజాగా సాగర్ సోసైటీలోని తన ఎస్‌వీసీ కార్యాలయానికి వెళ్లారు. తమ వాహనంలో దిల్ రాజును తీసుకేళ్లారు. ప్రస్తుతం ఎస్‌వీసీ (SVC)ఆఫీసులో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు దిల్ రాజు సోదరుడు శిరీష్ నివాసంలో కూడా ఐటీ సోదాలు ముగిశాయి. వారు నిర్మించిన పలు సినిమాలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు, పన్ను చెల్లింపుల విషయంలో అవకతవకలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ రైడ్స్ గురించి అధికారులు ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి విషయాలు ప్రకటించలేదు.