Last Updated:

Dil Raju: ఐటీ దాడులపై స్పందించిన ‘దిల్‌’ రాజు – ఏం చెప్పారంటే

Dil Raju: ఐటీ దాడులపై స్పందించిన ‘దిల్‌’ రాజు – ఏం చెప్పారంటే

Dil Raju First Reaction on It Raids: టాలీవుడ్‌ నిర్మాత, తెలంగాణ ఫలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (FDC) ఇల్లు, నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి. గత ఐదు రోజులుగా ఆయన ఇంట్లో, SVC కార్యాలయంలో అలాగే ఆయన సోదరుడు శిరీష్‌ ఇంట్లోనూ సోదాలు జరిగాయి. మంగళవారం నుంచి శుక్రవారం వరకు జరిగిన ఈ రైడ్స్‌ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. నాలుగో రోజుతో ముగిసిన ఐటీ దాడులపై స్వయంగా దిల్‌ రాజు స్పందించారు. “వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఐటీ సోదాలు జరగడం సర్వసాధారణం.

ఊటీ అధికారులకు మేము పూర్తిగా సహకరించాం. ఐటీ రైడ్స్‌ జరిగినప్పుడు మా దగ్గర రూ. 20 లక్షలు ఉన్నాయి. మా అకౌంట్‌ బక్స్‌ అన్ని ఐటీ అధికారులు చెక్‌ చేశారు. మా దగ్గర డబ్బు, డాకుమెంట్స్‌ తీసుకున్నాని వార్తలు వేశారు. అందులో నిజం లేదు. గత ఐదేళ్ల నుంచి నేను ఎక్కడా కూడా పెట్టుబడులు పెట్టలేదు. నా దగ్గర డబ్బు, ఆస్తి పత్రాలు వంటివి దొరకలేదు. కానీ నా దగ్గర నుంచి రూ. 5 లక్షలు, శిరీష్‌ దగ్గర నుంచి రూ. 4.50 లక్షలు, మా కుమార్తె దగ్గర ఆరున్నర లక్షలు, ఆఫీసులో రెండున్నర లక్షలు.. ఇలా మొత్తం సుమారు రూ. 20 లక్షలు కంటే తక్కువే డబ్బు ఉంది. అది కూడా అనధికార డబ్బు కాదని, దానికి డాక్యుమెంట్స్‌ కూడా ఉన్నాయి.

లిమిట్స్‌ ప్రకారమే బంగారం కూడా ఉంది. ఐదు ఏళ్ల నుంచి మేము ఎప్పుడు, ఎక్కడ పెట్టుబడులు పెట్టలేదు, ఆస్తులు కొనలేదు. బిజినెస్‌ విషయంలో వారికి అన్ని వివరాలు ఇచ్చాం. అందరి అకౌంట్స్‌ క్లీన్‌గా ఉన్నాయి” అని చెప్పారు. అయితే గతంలోనూ తన ఆఫీసులో సోదాలు జరిగాయని గుర్తు చేశారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు జరిగిందన్నారు. తమ అకౌంట్స్‌ అన్ని ఐటీ డిపార్ట్‌మెంట్‌ అధికారులు ఆశ్చర్యపోయారన్నారు. దిల్‌ రాజు దగ్గర ఏదో ఎక్స్‌పెక్ట్‌ చేశామన్నారు. కానీ, ఇక్కడ అన్ని లెక్కలు నీట్‌గా ఉన్నాయని వారే చెప్పారన్నారు. అదే సమయంలో తన తల్లికి 19వ తేదీన జలుబు, దగ్గు ఎక్కువైందన్నారు. దీంతో తనని ఆస్పత్రికి తీసుకువెళ్లామని చెప్పారు.

కానీ, ఆమెకు గుండెపోటు అన్నట్టు కొంతమంది వార్తలు రాశారు. ఇప్పుడు ఆమె డిశ్చార్జ్‌ అయ్యిందని, ఉపరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ వల్ల దగ్గు ఎక్కువగా వచ్చిందని, దానిక సంబంధించి ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారని చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏమి లేని దానికి ఎక్కువగా ఊహించుకొని హైలైట్‌ చేస్తున్నారని అన్నారు. ఫేక్‌ కలెక్షన్స్‌ వల్లే ఐటీ సోదాలు జరుగుతున్నాయని వస్తోన్న వార్తలపై విలేఖరి ఆయన ప్రశ్నించారు. ఇండస్ట్రలోని అందరూ కలిసి దానిపై మాట్లాడతామని, ఆ విషయంపై తాను వ్యక్తిగతంగా కామెంట్‌ చేయకూడదన్నారు. అలాంటిది ఏమైనా ఉంటే ఇండస్ట్రీ తరపున కరెక్ట్‌ చేయాల్సి ఉందని, తొంభైశాతం టికెట్లు ఆన్‌లైలోనే కొనుగోలు చేస్తున్నారు. బ్లాక్‌మనీ సమస్య లేదన్నారు.