Dil Raju: ఐటీ విచారణకు దిల్ రాజు.. కీలక డాక్యుమెంట్లపై ఆరా
tolly Attends IT Investigation: టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఐటీ కార్యాలయానికి వెళ్లారు. ఈ మేరకు ఆయన ఐటీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇటీవల ఆయన కార్యాలయంతో పాటు నివాసాల్లో ఐటీ వ్యాపారాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు.
కాగా, దిల్ రాజు తనకు సంబంధించిన డాక్యుమెంట్లు, బ్యాంక్ స్టేట్‌మెంట్లను ఐటీ అధికారులకు అందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది సంక్రాంతి కానుకగా నిర్మాత దిల్ రాజు తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమాలు విడుదలయ్యాయి.
ఇందులో భాగంగానే సినీ నిర్మాణం, సినిమాలు విడుదలైన తర్వాత వచ్చిన లాభాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. దిల్ రాజుతో పాటు పలువురు దర్శక, నిర్మాతల ఇళ్లల్లో సైతం కూడా ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే.