Last Updated:

Rajamahendravaram to Delhi Flight: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇక సులువుగా విమాన ప్రయాణం

Rajamahendravaram to Delhi Flight:  ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇక సులువుగా విమాన ప్రయాణం

Flight service from Rajamahendravaram Airport to Delhi: ఏపీ ప్రజలకు ఎన్డీఏ సర్కార్ శుభవార్త చెప్పింది. ఢిల్లీ వెళ్లేందుకు ప్రయాణాన్ని మరింత సులభతరంగా చేసింది. రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి విమాన సర్వీస్‌ను ప్రారంభించింది. ఈ మేరకు ఇక్కడి నుంచి ఢిల్లీకి నేరుగా ప్రయాణించవచ్చు. కాగా, అంతకుముందు రాజమహేంద్రవరం నుంచి ఢిల్లీ వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది.

ఇదిలా ఉండగా, తొలుత రాజమహేంద్రవరం మధురపూడి ఎయిర్ పోర్టుకు మొదటి ఇండిగో డైరెక్ట్‌గా విమానం చేరుకుంది. ఈ మొదటి విమాన సర్వీసులో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రయాణించారు. ఆయనతో పాటు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు. వీరంతా ఢిల్లీ నుంచి రాజమహేంద్రవరానికి నేరుగా చేరుకున్నారు.

మరోవైపు ఢిల్లీ నుంచి వస్తున్న కేంద్ర మంత్రితో పాటు మంత్రులకు రన్ వే ల్యాండ్ అయిన ఇండిగో ఎయిర్ బస్‌కు వాటర్ కెనాల్స్ తో సిబ్బంది ఘన స్వాగతం పలికారు. దీంతో రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్డు మార్గాన వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఢిల్లీ వెళ్లేందుకు ఇతర ఎయిర్ పోర్టు నుంచి వెళ్లేవారు.

కాగా, రాజమండ్రిలోని మధురపూడి విమానశ్రయం నుంచి ఢిల్లీకి ఇవాళ్టి నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతున్నాయి. 6E 364 ఇండిగో విమాన సర్వీసు నేటి నుంచి రోజూ రాకపోకలు సాగించనుంది. ఈ విమానం ఉదయం 6.30కు ఢిల్లీ నుంచి మధురపూడి వచ్చి.. ఇక్కడి నుంచి ఉదయం 9.30కు బయలుదేరి వెళ్తుందని అధికారులు చెప్పారు. ఇప్పటికే రాజమండ్రి నుంచి  ముంబైకి విమాన సర్వీసులు ప్రారంభం కాగా.. తాజా సర్వీసుతో ఉభయ గోదావరి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.