Last Updated:

Pawan Kalyan In Unstoppable 2 : అన్ స్టాపబుల్ షో లో.. పవన్ కళ్యాణ్ ని డైలాగ్స్ తో ఆకాశానికి ఎత్తిన బాలయ్య..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు వచ్చేసింది. వారి అంచనాలకు మించి ఉండడంతో అభిమనులంతా ఓ రేంజ్ లో హ్యాప్పీ గా ఉన్నారు.ఆహా ఓటీటీ వేదికగా నందమూరి

Pawan Kalyan In Unstoppable 2 : అన్ స్టాపబుల్ షో లో.. పవన్ కళ్యాణ్ ని డైలాగ్స్ తో ఆకాశానికి ఎత్తిన బాలయ్య..

Pawan Kalyan In Unstoppable 2 : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు వచ్చేసింది. వారి అంచనాలకు మించి ఉండడంతో అభిమనులంతా ఓ రేంజ్ లో హ్యాప్పీ గా ఉన్నారు.

ఆహా ఓటీటీ వేదికగా నందమూరి బాలకృష్ణ  వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఏ రేంజ్ లో దూసుకుపోతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అన్ స్టాపబుల్ సీజన్ 2 కి ఇదే చివరి ఎపిసోడ్ కావడంతో.. భారీ రేంజ్ లో దీనిని ప్లాన్ చేశారు.

ఈ షో లో భాగంగా బాలకృష్ణ – పవన్ ల మధ్య జరిగిన ముచ్చట్లు అందరికీ తెగ నచ్చేస్తున్నాయి.

పవన్ తన వ్యక్తిగత జీవితంతో పాటు.. సినిమా విశేషాలను కూడా పంచుకున్నారు.

పవన్ చిన్ననాటి జీవితం.. సినిమా రంగంలోకి వచ్చిన మార్పులను అభిమానులకు తెలియజేశాడు.

తనలో జరిగిన మానసిక సంఘర్షణను పవన్ ఆవిష్కరించిన తీరు అద్భుతంగా ఉంది.

ఒకానొక సమయంలో.. తను గన్ పట్టుకున్న సమయాన్ని కూడా పవన్ అభిమానులకు తెలిపారు.

రామ్ చరణ్.. సాయి ధరమ్ తేజ్ లకు పవన్ ఎలా సన్నిహితంగా మారారో ఇందులో చక్కగా వివరించారు.

రాజకీయాలు.. సమాజానికి చేయాల్సిన సేవను పవన్ ఈ షో లో తెలిపారు.

 

Image

అదిరిపోయిన బాలయ్య , పవన్ డైలాగ్స్..

ముఖ్యంగా ఈ ఎపిసోడ్ లో బాలయ్య తనదైన డైలాగ్ లతో రెచ్చిపోయారు. పవన్ కళ్యాణ్ ఈ రేంజ్ లో త్రివిక్రమ్ కూడా పొగడలేరేమో అనేంతలా బాలయ్య తన మాటలతో మెస్మరైజ్ చేశారు.

ముందుగా ఈ రోజు నాతో పాటు వచ్చిన వ్యక్తి- ఓ శక్తి- శక్తిని మించిన వ్యక్తిత్వం- నటుడు- నాయకుడు- ప్రజాసేవకుడు- ప్రశ్నల యంత్రం- విప్లవమంత్రం- నిజాయితీకి నిలువెత్తు అద్దం- నిబద్ధతకు నిలువెత్తు రూపం…” అంటూ బాలయ్య పవన్ కు సవాగతం పలికారు.

ఆ తర్వాత  ‘సామాజిక అంశాలలో సుభాష్ చంద్రబోస్ అంతటి వాడు’ అన్న అర్థంలోనూ పొగిడేయడం మరీ అతిశయోక్తిలా అనిపిస్తుంది.

అదే విధంగా “ఈశ్వరా…పవనేశ్వరా… పవరేశ్వరా…” అంటూ బాలయ్య అనడమూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అలాగే బాలయ్య ఈ షో లో ఎప్పుడూ చెప్పే “నేను మీకు తెలుసు…నా స్థానం మీ మనసు…”అని పవన్ కళ్యాణ్ చెప్పడం అలరించక మానదు. ‘స్టార్ట్ కాకుండానే చెమటలు పట్టిస్తున్నారు…’ అని పవన్ చెప్పడమూ మురిపిస్తుంది.

“నాకంటే చిన్నవాడివి… కాబట్టి మీరు అనలేను… భయ్యా అంటాను…” అంటూ బందల గణేష్ డైలాగ్ ని బాలయ్య చెప్పడం హైలైట్ గా నిలిచింది.

వెనటనే పవన్ కూడా బాలయ్య ఎంట్రీ డైలాగ్ నా స్థానం మీ మనసు చెప్పడం నందమూరి ఫ్యాన్స్ ని కూడా ఫిదా చేస్తుంది.

వారిద్దరూ తమ మొదటి కలయికను గుర్తు చేసుకున్నారు. “అమ్మా…నిన్నుచూస్తే నాకు కుల్లు…ఎందుకంటే మేం పాటల కోసం, ఫైట్స్ కోసం పాట్లు పడతాం… నువ్వేమో అంత కష్టపడకుండా నవ్వుతో పడేస్తావ్…” అంటూ బాలయ్య అనడం అందరికీ క్రేజీగా అనిపిస్తుంది.

‘ఈ పెళ్ళిళ్ళ గొడవేంటి భయ్యా?’ అన్న ప్రశ్నకు పవన్ ఏ మాత్రం దాచుకోకుండా అన్నీ వివరించిన విధానం కూడా అలరిస్తుంది. అంతా విన్న తరువాత బాలయ్య, “ఇకపై పవన్ గురించి, ఆయన పెళ్లిళ్ళ గురించి ఎవరైనా మాట్లాడితే మీరు ఊరకుక్కలతో సమానం” అంటూ అదిరిపోయే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు.

ప్రస్తుతం ఈ ఎపిసోడ్ లో వీరిద్దరి డైలాగ్స్ షో కి హైలైట్ గా మారాయి.   ప్రస్తుతం ఈ ఎపిసోడ్ రికార్డులను తిరగరాస్తూ ఓటీటీ లో దూసుకుపోతుంది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/