Last Updated:

Pawan kalyan In Unstoppable 2 : అసలు పెళ్ళే వద్దనుకున్నా కానీ.. బాలకృష్ణ అన్‌స్టాపబుల్ లో 3 పెళ్లిళ్లపై క్లారిటీ ఇచ్చిన పవన్

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఏ రేంజ్ లో దూసుకుపోతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. అన్ స్టాపబుల్ షో లో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ నిన్న రాత్రి స్ట్రీమింగ్ అయ్యింది.

Pawan kalyan In Unstoppable 2 : అసలు పెళ్ళే వద్దనుకున్నా కానీ.. బాలకృష్ణ అన్‌స్టాపబుల్ లో 3 పెళ్లిళ్లపై క్లారిటీ ఇచ్చిన పవన్

Pawan kalyan In Unstoppable 2 : నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఏ రేంజ్ లో దూసుకుపోతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది.

అన్ స్టాపబుల్ షో లో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ నిన్న రాత్రి స్ట్రీమింగ్ అయ్యింది.

ఈ ఎపిసోడ్ ఆద్యంతం అలరిస్తూ అందర్నీ మెప్పిస్తుంది.

బాలయ్య పవన్ ని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు. సినిమాలు, రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఎలాంటి సమాధానాలు ఇస్తారు? ఇక తన వ్యక్తిగత జీవితం.. 3 పెళ్లిళ్లపై పవన్ ఓపెన్ అవుతాడా ? ఇలా ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ నెలకొంది.

అయితే అందరి అంచనాలను రెట్టింపు చేస్తూ పవన్ తనదైన శైలిలో చెలరేగారు.

ఈ సందర్భంగా మూడు పెళ్ళిళ్ళ గురించి ఓపెన్ అయ్యారు.

ముందుగా ఈ పెళ్లిళ్ల గోల ఏంటి భయ్యా అని బాలయ్య ప్రశ్నించగా.. తన మొదటి పెళ్లిళ్ళ గురించి అన్ని వివరాలు పూసగుచ్చినట్లు వివరించారు.

 

Image

 

పవన్ సమాధానం ఇస్తూ.. నేను ఒక యోగిలాగా మారుదామని అనుకున్నా. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండాలనే ఆలోచన ఉండేది. కానీ అనుకోకుండా చేసుకోవాల్సి వచ్చింది.

నాకు మొదటి వివాహం జరిగే సమయానికి పెళ్లి అంటే సరైన అవగాహన లేదు.

పెళ్ళికి ప్రిపేర్ గా లేను. కానీ కుటుంబ సభ్యులు వివాహం చేశారు.

దీనితో మొదటి భార్యతో అభిప్రాయాలు కుదర్లేదు. అందుకే విడిపోవాల్సి వచ్చింది.

ఆ తర్వాత రెండవ భార్యతో కూడా అభిప్రాయాలు కుదర్లేదు.

ఆ తర్వాత మూడవ వివాహం చేసుకున్నాను అని పవన్ తెలిపారు.

విమర్శలు చేసే వారికి నేను చెప్పేది ఒక్కటే.. నేమీ ఒకేసారి మూడు పెళ్లిళ్లు చేసుకోలేదు .. ఒకేసారి ముగ్గురితో కలిసి ఉండటం లేదే అని చెబుతున్నా వినిపించుకోరు” అని అన్నారు.

“ఒకరితో నాకు కుదరదని అనుకున్నప్పుడు నేను విడాకులు ఇచ్చేసి చట్టబద్ధంగా మరో పెళ్లి చేసుకున్నాను  అని క్లారిటీ ఇచ్చారు.

 

 

ఇక రాజకీయంగా నన్ను తిట్టడానికి వాళ్ళకి నాలో ఇంకేమీ లేదు. అందుకే ఈ పాయింట్ తీసుకుని తిడుతుంటారు. నేను కూడా వాళ్ళని తిరిగి తిట్టొచ్చు. కానీ నాకు సంస్కారం అడ్డు వస్తోంది.

వాళ్ళకి కూడా కుటుంబాలు ఉంటాయి. భార్య పిల్లలు ఉంటారు. నేను తిడితే వాళ్ళు బాధపడతారు.

అందుకే వాళ్ళు తిట్టినా నేను సైలెంట్ గా ఉంటాను. ఆ సంస్కారం వాళ్ళకి లేదు.

అందుకే వ్యక్తిగతంగా వెళ్ళకూడదు అని ఆలోచించలేకున్నారు అంటూ పవన్ హాట్ కామెంట్స్ చేశారు.

అంతా విన్న తరువాత బాలయ్య, “ఇకపై పవన్ గురించి, ఆయన పెళ్లిళ్ళ గురించి ఎవరైనా మాట్లాడితే మీరు ఊరకుక్కలతో సమానం…” అంటూ అదిరిపోయే రేంజ్ లో వార్నింగ్ ఇచ్చారు.

మొత్తానికి ఈ ఎపిసోడ్ నందమూరి, మెగా అభిమానులకు ఫుల్ గా నచ్చేసిందని చెప్పాలి. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై రికార్డులు కొల్లగొడుతూ దూసుకుపోతుంది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/