US Flight : ఫ్లెట్‌లో దుస్తులు విప్పి ప్రయాణికురాలి వింత చేష్టలు

US Flight : విమానంలో మహిళా ప్రయాణికురాలు చేసిన వికృత చేష్టలకు పాల్పడింది. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. తన ఒంటపై ఉన్న దుస్తులు విప్పి పెద్దగా అరుస్తూ అటూఇటూ తిరిగింది. అగ్రరాజ్యం అమెరికాలోని హ్యూస్టన్ నుంచి ఫీనిక్స్ వెళ్తున్న సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానంలో మహిళ ప్రవర్తన తీవ్ర గందరగోళానికి దారితీసింది. దీంతో విమానం వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.
విమానం టేకాఫ్ అవుతుండగా..
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. హ్యూస్టన్‌లోని విలియం పీ హాబీ విమానాశ్రయం నుంచి విమానం టేకాఫ్ అవుతుండగా, ఇంతలోనే ఓ మహిళ పెద్దగా కేకలు వేసింది. తన ఒంటిపై ఉన్న బట్టలను తొలగించి, పెద్దగా అరుస్తూ విమానంలో అటూఇటూ తిరిగింది. కాక్‌పిట్ డోర్ వద్దకు వెళ్లి.. డోర్‌ను కొడుతూ తనను దించేయాలని ఆమె డిమాండ్ చేసింది. సుమారు 25 నిమిషాల పాటు మహిళా ప్రయాణికురాలు వికృత చేష్టలకు పాల్పడిందని ఓ ప్రయాణికుడు వెల్లడించారు. దీంతో పైలట్లు ఫ్లెట్‌ను వెనక్కి మళ్లించాడు. ఆమె ఒంటిపై దుప్పటి కప్పి, మిమానం దించేసి హ్యూస్టన్ పోలీసులకు అప్పగించారు. వికృత చేష్టలకు పాల్పడిన సదరు మహిళ పారిపోవడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. తర్వాత ఆమెను మానసిక వైద్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతానికి మహిళపై కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.
90 నిమిషాలు ఆలస్యంగా..
ఈ సంఘటనతో తాము ఆందోళనకు గురయ్యామని మిమానంలోని ప్రయాణికులు తెలిపారు. మహిళ చేసిన ప్రవర్తనతో తాము తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నామని, అందరం భయపడినట్లు చెప్పారు. ఈ సంఘటన కారణంగా మిమానం 90 నిమిషాల ఆలస్యంతో గమ్యస్థానానికి బయలు దేరింది. ప్రయాణికులకు కలిగిన అంతరాయానికి తామే చింతిస్తున్నట్లు సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది.