Megastar Chiranjeevi: ఉద్యోగాలు, పేదల గురించి ఆలోచించాలి.. ఏపీ సర్కార్ పై మెగాస్టార్ చిరంజీవి డైరక్ట్ అటాక్
ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి విమర్శలు గుప్పించారు. వాల్తేరు వీరయ్య 200 డేస్ ఈవెంట్‌లో మాట్లాడిన చిరంజీవి.. ప్రభుత్వం ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, ఉద్యోగాలు, పేదల గురించి ఆలోచించాలన్నారు. ఇలాంటి విషయాలపై ఆలోచించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు.

Megastar Chiranjeevi: ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి విమర్శలు గుప్పించారు. వాల్తేరు వీరయ్య 200 డేస్ ఈవెంట్‌లో మాట్లాడిన చిరంజీవి.. ప్రభుత్వం ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, ఉద్యోగాలు, పేదల గురించి ఆలోచించాలన్నారు. ఇలాంటి విషయాలపై ఆలోచించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు.
పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా ..(Megastar Chiranjeevi)
పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీపై పడతారేంటి? చిరంజీవి ప్రశ్నించారు. ఇదేదో పెద్ద సమస్యలా చూపించకండని మెగాస్టార్ చిరంజీవి విజ్ఞప్తి చేశారు.ఈ రోజుల్లో సినిమాలు రెండు వారాలే ఆడుతున్నాయని ఇటువంటి సమయంలో వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజులు ఆడటం ఆనందంగా ఉందన్నారు. దీనికోసం షీల్డు అందుకుంటుంటే ఒళ్లు పులకరిస్తోందని చిరంజీవి అన్నారు. చిరంజీవి,శ్రుతిహాసన్, రవితేజ, కాధరిన్ తదితరులు నటించిన వాల్తేరు వీరయ్యకు బాబీ దర్శకత్వం వహించారు.
ఇవి కూడా చదవండి:
- Chandrababu Naidu Comments: జగన్ మూర్ఖత్వం వల్లే పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతింది.. చంద్రబాబు నాయుడు
- Data Protection Bill: డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుకు లోక్సభ ఆమోదం