Chiranjeevi: ఎంత పెద్ద స్టార్స్ అయినా మెగాస్టార్ కు అభిమానులే.. ఈ ఫోటోనే నిదర్శనం

Chiranjeevi: స్టార్.. స్టార్.. మెగా.. స్టార్ స్టార్.. చిరంజీవి. ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్వయంకృషితో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆయన ఇండస్ట్రీలో ఎదిగిన విధానం ఎంతోమందికి ఆదర్శం. ఇప్పుడు కుర్ర హీరోలుగా కొనసాగుతున్నవారైనా.. స్టార్ డైరెక్టర్స్ గా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నవారైనా.. వారిలో చాలామందికి చిరుని ఆదర్శం. వారందరూ కూడా ఒకప్పుడు చిరు సినిమా చూడడానికి టికెట్స్ కోసం బయట ఎదురుచూసినవారే. ఇంకొంతమంది ఆయన సినిమా కోసం చొక్కాలు చింపుకున్నారు.. మరికొంతమంది సైకిళ్ళు కూడా పోగొట్టుకున్నారు.
ఇక అలా చిరంజీవి డై హార్ట్ ఫ్యాన్స్ లిస్ట్ లో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఒకరు. అర్జున్ రెడ్డి సినిమాతో కెరీర్ ను ప్రారంభించి మొదటి సినిమాతోనే టాలీవుడ్ చరిత్రను తిరగరాసిన సందీప్.. బాలీవుడ్ లో యానిమల్ సినిమాతో అక్కడ కూడా కొత్త చరిత్రను రాశాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
సందీప్ సినిమాల విషయం పక్కన పెడితే.. ఆయన మెగాస్టార్ కు పెద్ద అభిమాని. చిన్నతనం నుంచి చిరు సినిమాలు, సాంగ్స్ వింటూ పెరిగాడు. చిరు సినిమాలు చూసే ఆయన డైరెక్టర్ గా మారాడు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. చిరు మీద ఉన్న అభిమానంతోనే వంగా ఆఫీస్ లో చిరు రేర్ ఫొటోస్ ను ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకున్నాడు. ముఖ్యంగా వంగా ఆఫీస్ లో చిరంజీవి ఆరాధన సినిమాలోని ఒక స్టిల్ అప్పట్లో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది.
NKR21: నందమూరి కళ్యాణ్ రామ్.. పవర్ ఫుల్ టైటిల్ తో వస్తున్నాడు.. ఇక దబిడిదిబిడే
ఇక చిరు సైతం వంగా ఆఫీస్ కు వెళ్లి మరీ వాటిని తిలకించాడు. సందీప్ తో చిరు అలా కనిపించేసరికి వీరి కాంబోలో ఒక సినిమా వస్తుందని కొందరు.. చరణ్ తో సినిమా తీయమని అడగడానికి చిరు వెళ్లాడని ఇంకొందరు చర్చించుకున్నారు. తాజాగా చిరు తరువాత వంగా ఆఫీస్ లో స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సానాప్రత్యేక్షమయ్యాడు. ఏంటి మొన్న చిరు.. నేడు బుచ్చిబాబు.. వరుసగా వంగా ఆఫీస్ కు స్టార్స్ ఎందుకు వస్తున్నారు.. ? చాలామంది ఆరాలు తీయడం మొదలుపెట్టారు.
స్టార్స్ అందరూ వంగా ఆఫీస్ చుట్టూ తిరగడానికి కారణం చిరు ఫొటోలే అని తెలుస్తోంది. ఆయన ఆఫీస్ లో ఉన్న చిరు ఫోటోలను చూడడానికి మెగా కల్ట్స్ అయిన స్టార్స్ అందరూ క్యూ కడుతున్నారు. బుచ్చిబాబు కూడా అందుకే వచ్చాడని టాక్. ఇద్దరు కలిసి చిరు ఫోటో దగ్గర ఇదుగో ఇలా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు ఎంత పెద్ద స్టార్స్ అయినా మెగాస్టార్ కు అభిమానులే.. ఈ ఫోటోనే నిదర్శనం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.