Last Updated:

Riteish Deshmukh : లేడీ ఫ్యాన్ కాళ్ళు పట్టుకున్న బాలీవుడ్ హీరో..!

ప్రముఖ బాలీవుడ్ హీరో రితేష్‌ దేశ్‌ముఖ్‌ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. బాయ్స్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది న‌టి జెనీలియా. ఆ తర్వాత స‌త్యం, సై, హ్యాపీ, బొమ్మ‌రిల్లు వంటి సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా " బొమ్మరిల్లు " మూవీ ఈ భామకు బోలెడు క్రేజ్ తీసుకొచ్చింది.

Riteish Deshmukh : లేడీ ఫ్యాన్ కాళ్ళు పట్టుకున్న బాలీవుడ్ హీరో..!

Bollywood News: ప్రముఖ బాలీవుడ్ హీరో రితేష్‌ దేశ్‌ముఖ్‌ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. బాయ్స్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది న‌టి జెనీలియా. ఆ తర్వాత స‌త్యం, సై, హ్యాపీ, బొమ్మ‌రిల్లు వంటి సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా ” బొమ్మరిల్లు ” మూవీ ఈ భామకు బోలెడు క్రేజ్ తీసుకొచ్చింది. కెరీర్ పరంగా ఫుల్ ఫామ్ లో ఉండగానే రితేశ్ ని వివాహం చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.

అయితే ఈ భార్యభర్తలిద్దరూ కలిసి మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈ మేరకు నాగ చైతన్య, సమంత కలిసి నటించిన ” మజిలీ ” సినిమాని మరాఠీలో రీమేక్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను కూడా రితేష్ నిర్వహిస్తుండడం గమనార్హం. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని డిసెంబర్ 30న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు సినిమా ప్రమోషన్స్ ను ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు ఈ కపుల్.

ఇటీవల ఈ చిత్ర ప్రమోషన్స్ ని మహారాష్ట్ర లోని ఓ కాలేజీలో ఏర్పాటు చేశారు. ఈ సంధర్భంగా రితేష్, చిత్ర యూనిట్ విద్యార్థులతో ముచ్చటించారు. ఈ నేపథ్యంలో ఓ లేడీ ఫ్యాన్ రితేష్ తో కలిసి డ్యాన్స్ చేయాలని ఉందని కోరింది. రితేష్ కూడా అందుకు అంగీకరించి ఆమెతో కలిసి డ్యాన్స్ చేయగా… ఆ యువతి ఎమోషనల్ అయ్యి రితేష్ కాళ్ళకి దండం పెట్టింది. వెంటనే రితేష్ కూడా ఆమెను లేపి తన కాళ్లకు దండం పెట్టాడు. దీంతో స్టార్ హీరో అయ్యి కూడా ఇలా చేయడం పట్ల అభిమానులు, నెటిజన్లు రితేష్ ని పొగుడుతూ సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి: